Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) నియామక పరీక్ష హాల్‌టికెట్లు విడుదల

హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ (TSPSC) అందుబాటులో ఉంచింది. ఈ నెల 28న ఏఎంవీఐ నియామక పరీక్ష జరగనుంది. ప్రాక్టీసు కోసం వెబ్‌సైట్‌లో మాక్‌టెస్ట్‌ లింకును కూడా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Also read: పనితీరు మార్చుకోకపోతే టిక్కెటు రాదు

తెలంగాణ రవాణా శాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1వరకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ పరీక్ష ఏప్రిల్‌ 23న జరగాల్సి ఉన్నప్పటికీ TSPSCలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపడంతో పలు పరీక్షలను రీషెడ్యూల్‌ చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఏఎంవీఐ రాత పరీక్ష తేదీని జూన్‌ 28కి కమిషన్‌ మార్చింది.