Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శంకరమ్మకు ఎమ్మెల్సీ

తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నారన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాలల్ళ్ జరుగుతొంది.మలిదశ తెలంగాణ ఉద్యమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రాజకీయంగా కీలక పదవి ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని.. ఈ మేరకు శంకరమ్మకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందనే చర్చ జరుగుతోంది.

కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెను మంత్రి జగదీష్‌రెడ్డి హైదరాబాద్ తీసుకువచ్చారని.. మంత్రి కేటీఆర్ హామీ మేరకు శంకరమ్మకు గవర్నర్ కోటాలోఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమరవీరుల కుటుంబాలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఇటీవలి కాలంలో విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చునని కె సి ఆర్ వ్యూతెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న తరుణంలో.. శంకరమ్మకు పదవి ఇవ్వడం రాజకీయంగా తమకు కలిసొస్తుందనే భావనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.ఈ నేపధ్యంలోనే తెలంగాణ మలి దశ పోరాట తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తొమ్మిదేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

గతంలో హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి శంకరమ్మ ఓడిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు.. టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ ఆమెకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చిన హైకమాండ్ సైదిరెడ్డికి చాన్స్ ఇచ్చింది. ఆయన విజయం సాదించారు. అప్పటి నుంచి శంకరమ్మ ఎమ్మెల్సీ పదవి కోసం చూస్తున్నారు.

ఈ మేరకు మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం ఆమెతో మాట్లాడి, సీఎం నిర్ణయాన్ని వివరించారు. సచివాలయం ఎదుట నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. అదే వేదికపై శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే సీఎం నిర్ణయం తీసుకోవడంతో శంకరమ్మకు ప్రభుత్వ వాహనంతోపాటు పీఏ, గన్‌మెన్‌ను బుధవారమే కేటాయించారు.

Also read: తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు

కాగా, గవర్నర్‌ కోటాలో రెండు స్థానాలు ఖాళీ కాగా, ఒక స్థానాన్ని శంకరమ్మకు కేటాయించారు. మరో స్థానం కోసం ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌, టీఎ్‌సపీఎస్సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి, పీఎల్‌ శ్రీనివాస్‌, బండి రమేశ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలకు గుర్తుగా ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నం గురువారంప్రారంభం కానుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఈ స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ , హుస్సేన్ సాగర్ తీరాన.. వెలుగుతున్న దీపంలా కనిపించే ఈ స్మారక చిహ్నానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

శ్రీకాంతా చారి ఎల్పీనగర్ చౌరస్తాలో ఆత్మాహుతి చేసుకున్నారు. అందుకే ఇటీవల అఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ నిర్ణయంపై శ్రీకాంత్ చారి తల్లి కూడా స్పందించింది. ‘నా కొడుకు త్యాగానికి ఇది సరైన నిర్ణయం. తెలంగాణ కోసం ఎల్బీనగర్ చౌరస్తాలో నా కొడుకు పెట్రోల్ పోసుకుని మాంసం కరగపెట్టుకున్నాడు.

అయితే నిన్న కేటీఆర్ చేసిన పనికి మా కొడుకు ఆత్మా శాంతిస్తుంది. నా మనసు కూడా తృప్తి పడింది. చనిపోయిన నా కొడుకుకు మళ్ళీ ప్రాణం పోసినట్టు నాకు అనిపిస్తుంది’ అంటూ భావోద్వేగం అయ్యారు.

రచన: సి.హెచ్.సాయిప్రతాప్