తెలుగు రాష్ట్రాలలో వర్షాభావ పరిస్థితులు
తెలుగు రాష్ట్రాల్లో చినుకు జాడ లేక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు దాటుతున్నా నైరుతి రుతుపవనాలు పలకరించడం లేదు.
ఐ ఎం డి ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు కాస్త ఆలశ్యం అవుతాయని ముందే హెచ్చరించినా జూన్ రెండో వారానికల్లా రావచ్చునన్న ఆశ రైతులలో ఇప్పటి వరకు నెలకొని వుంది. అయితే 19 వ తారీఖు వచ్చేసినా ఇప్పటృఇ వరకు చినుకు జాడ లేకపోవడంతో యావత్ రైతాంగం తీవ్ర నైరాశ్యంలో మునిగి వున్నారు.
పైగా రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రారంభమైంది. సాధారణంగా ఈ కార్తె నుంచే వర్షాలు కురుస్తాయి. కానీ ఇప్పటికీ 40 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎందలు దంచి కొడుతుండదంతో వ్యవసాయ పనులు ఎక్కడా ప్రారంభం కాలేదు.
దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రభావం నాలుగు వారాల వరకు అంతగా ఉండదని స్కైమేట్ తెలిపింది. ఈసారి వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వ్యవసాయంపై అధాపడే రైతులకు కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేసింది.
Also read: కాంగ్రెస్ తో షర్మిళ మైత్రి
స్కైమెట్ అంచనా ప్రకారం జూలై 6 వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని తెలిపింది. వర్షాధర పంటైన వరి సాగు ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక మధ్య, పశ్చిమ భారత్ ప్రాంతాల్లోని రైతులు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని వెల్లడించింది
వరి, పంచదార, పత్తి, ముతక తృణధాన్యాలు మరియు నూనె గింజలు వంటి వేసవి పంటలను విత్తడం ప్రారంభించడానికి మిలియన్ల మంది రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తిలో సగం వేసవి పంటలపై ఆధారపడి ఉంటుంది.
స్కైమెట్ సంస్థ అంచనాలు :
రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని ప్రైవేట్ వాతావరణ సూచన స్కైమెట్ సోమవారం తెలిపింది. ఎల్ నినో వాతావరణ దృగ్విషయం జూన్ మరియు ఆగస్టు మధ్య 60% ఉంటుందని పేర్కొంది.
సాధారణంగా జూన్ 1న రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి వారం ఆలస్యంగా జూన్ 8న కేరళను తాకాయి. అరేబియా సముద్రంలో గుజరాత్ తీరంలో ఏర్పడిన బిపోర్జాయ్ తుపాన్ కారణంగా ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చినట్లు స్కైమేట్ తెలిపింది.
రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా లేవని.. మందకొండిగా కదులుతున్నాయని పేర్కొంది. రుతుపనాలు నెమ్మదిగా కదిలితే.. మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బిహార్ లో జూన్ 15 వరకు కూడా నైరుతి చేరుకోవడం కష్టమని తెలిపింది.
ఈ నేపధ్యంలో ప్రభుత్వాలే మమల్ని గట్టెకించాలని అశేష రైతాంగం ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు.
వర్షాలు ఆలస్యంగా కురిస్తే పంట దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సారి రైతులు ఆశించిన సమయానికి వర్షాలు కురుస్తాయనే ఆశతో సాగు పెరుగుతుందని ఆశించారు.
(సాయిప్రతాప్)