Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పొలం లో కొయ్యలకు నిప్పు….మద్యం దుకాణం దగ్ధం

*సుమారు 40 లక్షలు అస్థి నష్టం*

*సూర్యాపేట జిల్లా*

*గరిడే పల్లి మండలం*

జూన్ 21:

రైతుల పొలం లో కోయ్యాలు కాల్చాలన్న దురాలోచన తో ఒక వైన్ షాపే మంటల్లో చిక్కుకొని దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది. గరిడేపల్లి మండల కేంద్రంలో ఒక వైన్స్ L.N WINES దుకాణాన్ని పొలాల మధ్యలో ఏర్పాటు చేయడంతో ఒక రైతు ఓడిపోయేలను తగలబెట్టేందుకు నిప్పంటించగా గాలి దుమారం చెలరేగి మంటలు పొగ వ్యాప్తి చెంది పక్కనే ఉన్న వైన్స్ దుకాణంలోకి మంటలు ఎకపోయగా సహజంగా మండే గుణమున్న ఆల్కహాల్ మంటలు చెలరేగడంతో దుకాణం పూర్తిస్థాయిలో దగ్ధమై పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. అక్కడికి వచ్చిన మందుబాబులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎగిసి పడ్డ మంటలతో దట్టమైన పొగలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది.

వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు వరి కోయలు తగలబెట్టడం సరైన పద్ధతి కాదని రైతులకు ఎన్నిసార్లు తెలియపరిచిన పదేపదే ఇలా పొలంలో ఓరికోయేలను తగలబెడుతూ భూమిలోని విలువైన వాన పాములు లాంటి పంటలకు ఉపయోగపడే జీవరాశులను చంపుతూ మోటార్లు పైపులు వైర్లు తదితర సామాన్లు తగలబడుతున్న సంఘటనలు పునరావృతం అవుతున్న పట్టించుకోకుండా చేస్తున్న ఇలాంటి దుందుడుకు అనాలోచిత చర్యల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఒక ఉదాహరణగా ఈ సంఘటన మిగిలిపోనుంది…