Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మళ్ళీ తెరపైకి రెండో రాజధానిగా హైదరాబాద్

ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం నేపథ్యంలో విసృతంగా హైదరాబాద్ ను రెండవ రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపించింది. ఈ డిమాండ్ సహేతుకమైనదేనని అప్పట్లో పలువురు విద్యావేత్తలు సమర్ధించారు. అయితే వివిధ కారణాల వలన ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీ సుకువెళ్ళలేదు. అయితే సదరు అంశం తాజాగా మరొకసారి తెరపైకి వచ్చింది.

దేశానికి రెండవ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నాయకుడు సిహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల తిరిగి ప్రతిపాదించారు.గ‌తంలో కూడా ఢిల్లీలో కాలుష్య స్థాయి తీవ్రంగా ఉండటంతో.. దేశానికి రెండో రాజధాని కావాలని, అది హైదరాబాద్ అవుతుందన్నట్టుగా చెప్పారు.లా అండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాద్ నెంబర్ వన్ గా ఉందన్నారు.

Also read: క్రీడా రంగం లో స్పష్టమైన మార్పు

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఇటీవల చేసిన ప్రకటనను విద్యాసాగర్ రావు ప్రస్తావిస్తూ అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయమై ఏకాభిప్రాయానికి రావలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

దేశానికి రెండవ రాజధాని అవసరమని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారని ఆయన గుర్తు చేశారు. దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ను చేసే అవకాశాలు చాలా ఉన్నాయని , పైగా దిల్లీ తర్వాత అందుకు గల అర్హతలు కేవలం హైదరాబాద్ కు మాత్రమే వున్నాయని ఆయన కుండ బద్దలు కొట్టారు.

దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఏర్పడితే అనేక అవకాశాలు నగరానికి దక్కే అవకాశం ఉన్నప్పటికీ అయితే దీని పాలనాపరమైన, శాసనపరమైన విస్తృత ప్రక్రియ అవసరమవుతుంది అని నిపుణులు భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఈ డిమాండ్ ను సాకారం చెయ్యడం కష్టమేమీ కాదని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సాయిప్రతాప్