Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మీకు వచ్చిన ఐటమ్స్ తోనే సర్దుకోండి

దారి తప్పిన ఫ్లిప్కార్ట్ ఆర్డర్స్

*చిరునామా మార్చి వినియోగదారులకు నామాలు పెడుతున్న వైనం
*పరిష్కారం చెప్పకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్న సిబ్బంది

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (బిక్కవోలు మండలం )జూన్ 21.. నిజం చెపుతాం న్యూస్…

ఈ రోజుల్లో టూత్ పేస్ట్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం పరిపాటి అయిపోయింది.ఈ విధంగా వినియోగదారుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని ఆన్లైన్ వ్యాపార సంస్థలు పలు పొరబాట్లకు తెర తీస్తున్నాయి. విషయంలోకి వస్తే ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ నందు మెళ్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వినియోగదారుడు గ్రోసెరీ ఐటమ్స్ ఆర్డర్ చేయగా,ఆయన చిరునామాకి బొబ్బిలికి చెందిన నాగరాజు అనే వినియోగదారుడుకి చెందిన గ్రోసెరీ ఐటమ్స్ ను మంగళవారం మధ్యాహ్నం డెలివరీ చేయడం జరిగింది.

విషయం గమనించిన శ్రీనివాస్ డెలివరీ పర్సన్ కి ఇవి తమ వస్తువులు కాదు అని తెలియజేసినప్పటికీ,
ఎటువంటి పరిష్కారం చూపకుండా ఫ్లిప్కార్ట్ సంస్థ రామచంద్రపురం పట్టణానికి చెందిన సిబ్బంది,మరలా
మరో తప్పిదానికి ఒడికడుతూ ఎటువంటి ఆర్డర్ డెలివరీ చేయకుండానే రాత్రి 7.30 కి శ్రీనివాస్ కి సంబందించిన అసలు వస్తువులు డెలివరీ చేసినట్లు ఆన్లైన్ ట్రాక్ నందు తప్పుగా నమోదు చేయడం సిబ్బంది నిర్లక్ష్య ధోరణికి అర్ధం పడుతుంది.ఇదేమి విధానం అని శ్రీనివాస్ ప్రశ్నించగా రాంగ్ ఐటమ్స్ డెలివరీ విషయం వాస్తవమే అని,కాని దీనికి ఎటువంటి పరిష్కారం లేదని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.

ఇది కూడా చదవండి…తెలంగాణలో ఇక ప్రభుత్వ రైస్ మిల్లులు

ఇటువంటి విషయాలు ఒక ఉద్యోగిగా మీరు పరిష్కరించాలి కదా అని రామచంద్రాపురం ఫ్లిప్కార్ట్ కి చెందిన సంబంధిత ఉద్యోగిని అడుగగా మాకేం సంబంధం లేదు.మీకు వచ్చిన ఐటమ్స్ తోనే సర్దుకోండి అని నిక్కచ్చిగా చెప్పడం వినియోగదారుల హక్కులు హరించడమే అనేది అక్షరసత్యం.ఇలా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహారిస్తూ వినియోగదారులను వేదనకు గురిచేస్తున్న ఈ సంస్థలపై ఇప్పటికైనా సరియైన నియంత్రణ ఉండాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.