Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆదిపురుష్‌కు 242 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌..ఇప్పటి వరకు వచ్చిందెంతంటే…?

రెండు తెలుగు రాష్టాల్ల్రో కూడా ఆదిపురుష్‌ సినిమా వీకెండ్‌ అనంతరం చాలా తక్కువ స్థాయిలో కలెక్షన్స్‌ అందుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు ఏపీ తెలంగాణలో వచ్చిన షేర్‌ 32.84 కోట్లు, రెండవ రోజు 15.04 కోట్లు, మూడవరోజు 17 కోట్లు వచ్చాయి. ఇక నాలుగవ రోజు ఆంధప్రదేశ్‌ తెలంగాణలో ఈ సినిమా కేవలం 4.8 కోట్ల షేర్‌ మాత్రమే అందుకుంది.

మొత్తం నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణలో ఆదిపురుష్‌ సినిమాకు 69.76 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ 110.40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దక్కింది.

ఇది కూడా చదవండి….టాప్ 5 ఇండియన్ ఓపెనింగ్ బాక్స్ ఆఫీస్ జాబితా ఇదే

కర్ణాటకలో ఇప్పటివరకు 10.81 కోట్లు మేర అందుకోగా, తమిళనాడులో 2.6 కోట్ల రేంజ్‌ లో కలెక్షన్స్‌ అందుకుంది.
ఇక కేరళలో పెద్దగా ఓపెనింగ్స్‌ ఏవిూ రాలేదు. కేవలం అక్కడ ఇప్పటివరకు 72 లక్షలు షేర్‌ మాత్రమే వచ్చింది.

హిందీ అలాగే రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా మొత్తం చూసుకుంటే 59.20 కోట్ల షేర్‌ దక్కింది. ఇక ఓవర్సీస్‌ లో ఈ సినిమాకు 4 రోజుల్లో 20.90 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి.

మొత్తంగా సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో ఆదిపురుష్‌ సినిమా రూ.163.45 కోట్ల షేర్‌ కలెక్షన్స్‌ రూ.326.15 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ అందుకుంది..

ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 240 కోట్లు. దీంతో 242 కోట్ల బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ పిక్స్‌ అయింది. ఇక ఈ సినిమా ప్రాఫిట్‌ లోకి రావాలి అంటే ఇంకా బిజినెస్‌ కు తగ్గట్టుగా లెక్షన్స్‌ రావాలి.