మహిళల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం

దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు, కులందురంహార హత్యలు నిత్యం జరుగుతున్న పాలకులు వైఖరి మారటం లేదని హత్యాచారాలు చేసిన వారిపై నిర్భయ దిశ చట్టాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రభుత్వల వైఖరికి నిరసనగా PDS, PYZ, POW ఆధ్వర్యంలో దమ్మపేట మార్కెట్ యార్డ్ నుంచి ఆటో స్టాండ్ బస్టాండ్ మీదగా భారీ ప్రదర్శన నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా pow అధ్యక్షులు టీ దుర్గమ్మ, PYL మండల కార్యదర్శి కే వెంకటేష్, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ శర్వన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కే సంధ్య లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిపై దాడులు కేసులు వేయడం జరుగుతుందని, నేడు దేశంలో మనువాదని ప్రేరేపించటం కోసం రామరాజ్యం పేరు తో మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు అన్నారు, రాష్ట్రంలో గత రెండు సంవత్సరాల నుండి కులందురహార హత్యలు పరిశీలించి నిర్మూలించుటలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని వారు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించుటకు చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని హత్యాచారాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో pow నాయుకులు లక్ష్మి, సాయమ్మ, గంగమ్మ, బంగారు, pyz నాయుకులు ప్రసాద్, జగన్, జోగారావు, కె ప్రసాద్ pdsu నాయుకులు మనీషా సావ్య, దివ్య తదితరులు పాల్గొన్నారు.