Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పూరీ జగన్నాధ ఆలయ విశిష్టతే వేరు

భారతీయ సంస్కృతిలో అదో అద్భుతం. పౌరాణిక` చారిత్రిక ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒకానొక దివ్యయాత్రా ధామం.

ఆదిశంకరుల వారి దృష్టిలో ఈ క్షేత్రానికి విశేష ప్రాముఖ్యత వుంది. 17వ శక్తి పీఠంగా ఇక్కడి విమలాదేవి పూజలందుకుంటోంది. శివకేశవ తత్వానికి ప్రతీక. వైష్ణవ శక్తికి కేంద్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోన్న వైభవ క్షేత్రం పూరీ. ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించి తీరాలనుకునే ఒకానొక దివ్యధామం. చార్‌ ధామ్‌ క్షేత్రాల్లో అత్యంత ప్రధానమైంది.

రథయాతల్రో జగన్నాథుని రథాన్ని ’నందిఘోష్‌’ గా వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి పదహారు చక్రాలుంటాయి.

ఇది కూడా చదవండి….ఉమ్మడి పౌరస్మృతిపై చర్చించాల్సిందే ! 

బలభద్రుడి రథాన్ని ’తాళ్‌ధ్వజ్‌’ పేరుతో పిలుస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీన్ని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. తాళ ధ్వజ్‌ కు 14 చక్రాలు ఉంటాయి.

సుభద్రాదేవి రథాన్ని ’దర్ప దళన’ అంటారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. జగన్నాథుడు ఎన్ని ఆటంకాలనైనా దాటుకుని తన భక్తజనాన్ని కలుసుకోడానికి పెద్ద పెద్ద చక్రాలను రథానికి పూన్చుకుని అంగరంగ వైభవంగా వస్తాడు. అందుకే వాటికి ’జగన్నాథ రథచక్రాల్‌’ అన్న పేరొచ్చింది.

పూరీ జగన్నాథ ఆలయ గోపురపు అంచు విూద.. సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఇది నారాయణ రూపంలో నాలుగోది. దీనిపై ఒక పసుపు జెండా ఎగురుతూ కనిపిస్తుంది. దీనిలోని ఎరుపు గుర్తు జగాన్నాథుడు ఆలయంలోనే వున్నాడని సూచిస్తుందని భావిస్తారు.

పూరీ ఎంతటి ప్రసిద్ధ క్షేత్రమంటే, ఇప్పటి వరకూ ప్రతి హైందవ మతాచార్యుడూ ఈ క్షేత్ర దర్శనం చేశారు. ఒక్క మాధవాచార్యులు తప్ప.. ఈ క్షేత్రాన్ని ప్రముఖ ఆచార్యులందరూ దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు.