Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గొలుసులతో బంధించి మైనర్ బాలిక పై రెండేళ్లుగా లైంగిక దాడి చేస్తున్న స్వామిజీ.

గొలుసులతో బంధించి 15 ఏళ్ల బాలిక పై రెండేళ్లుగా లైంగిక దాడులు చేస్తున్న కీచక స్వామి.

** కీచక స్వామి ని ఆరెస్ట్ చేసిన పోలీసులు

విశాఖపట్నం నిజం న్యూస్

అనాధ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే ముసుగులో ఆ చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న కీచక స్వామి ని పోలీసులు అరెస్టు చేశారు.

విశాఖపట్నం వెంకోజీపాలెంలో ఉన్న జ్ఞానానంద రామానంద ఆశ్రమం (సాదుమఠం) నిర్వాహకుడు పూర్ణానంద సరస్వతి స్వామిజీ రాజమండ్రి కి చెందిన ఓ అనాద బాలిక తో పాటు మరో 13 మంది బాలికలను ఆశ్రమంలో ఉంచి వెట్టి చాకిరి చేయిస్తున్నారు.

తాము ఇక్కడ ఉండలేమని వెళ్లి పోతామని కన్నీళ్లు పెట్టుకున్నా కనకరించకుండా ఆ బాలికలను గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురి చేస్తూ లైంగిక దాడులకు పాల్పడే వాడు. రాజమండ్రి కి చెందిన బాలికపై రెండేళ్ల గా ఆ కీచక స్వామి లైంగిక దాడులుచేస్తూనే ఉన్నాడు.

ఇది భరించలేని ఆ బాలిక ఓ మహిళ సహకారంతో ఆశ్రమం నుంచి తప్పించుకుని కొందరి సహకారంతో విజయవాడ లో సీ. డబ్ల్యు. సీ సభ్యులను కలుసుకొని తమకు జరిగిన సంఘటనల గురించి వివరించింది. దీంతో నిర్ఘాంతపోయిన సబ్యులు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు.

దీంతో స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆశ్రమానికి చేరుకొని కీచిక స్వామిజీ ని అరెస్టు చేశారు. ఈ సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపనున్నారు. అనాధ బాలికలను చిత్రహింసలు పెట్టి లైంగిక దాడులకు పాల్పడిన కీచిక స్వామి ని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు