Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇంకెన్నాళ్లీ పర్యవరణ విధ్వంసం ? 

ప్రపంచవ్యాప్తంగా విపరీత వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. మానవుడు తనంతట తాను ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నా..పాలకులు కట్టడిచయయడంలేదు. ప్రజల్లో పాలకులు కూడా ఒకరే కావడం తో వారు తాము లాభపడితే చాలన్నట్లుగా చూస్తున్నారు. కొండలను ధ్వంసం చేస్తున్నాం. చెట్లను నరికి వేస్తున్నాం. చెరువులను కాలువలను మింగేశాం.

అడవులను విద్వంసం చేశాం.వన్యప్రాణులను మింగేశాం. అందుకే వర్షాకాలంలో ఎండాకాలం చూస్తున్నాం. నైరుతి రుతుపవానాల జాడలేకుండా పోయింది. ఎండ దెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. గుజరాత్‌ను ముంచెత్తిన వరదలకు విధ్వం చూశాం. ఇదంతా ప్రకృతి విధ్వంసం వల్ల..మానవ జనాభా విస్ఫోటనం వల్లనే అని తెలిసీ దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు.

భూవ్మిూద రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుపానులు, పిడుగులు వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశుల ఉనికి ఎలా ఉంటుందో ఏమో అనే సందేహం కలుగుక మానదు. వీటికి ఎన్నో కారణాలు ఉన్పప్పటికీ కారణం ప్రకృతి విధ్వంసం..మానవ తప్పిదాలే అని చెప్క తప్పదు.

మనిషి తన స్వార్థంకోసం పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. పుడమిని కాలుష్యమయం చేసి ప్రకృతి పట్ల తీసుకొన్న అనాలోచిత చర్యలు ఫలితమే ఈ విపత్తులు. అందుకే వానాకాలం ఎండలకు జనం పిట్టల్లా రాలడం అంటే ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తోంది. జూన్‌ నెల సగం గడిచినా నడినెత్తిన సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఉత్తరం,దక్షిణం, పశ్చిమం, తూర్పు అని తేడా లేకుండా దేశమంతా తీవ్ర వడగాలులతో ఉడికిపోతోంది. ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు రోజుల వ్యవధిలో యూపీలో 54 మంది, బిహార్‌లో 44మంది మృతి చెందారు. ఆస్పత్రుల్లో వసతులు లేకపోవడంతో రోగులను బంధువులు భుజాల విూద మోసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం.

ఇది కూడా చదవండి…ఈ వయసులో కూడా దుమ్ములేపుతున్న అండర్సన్‌

మరోవైపు బిహార్‌ రాజధాని పట్నాలో 24 గంటల్లో 35 మంది, ఇతర జిల్లాల్లో 9 మంది చనిపోయారు. పట్నానలంద వైద్య కళాశాల లోనే 19 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 11 జిలాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. కనీసం 18 ప్రాంతాల్లో అతి తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నందున గుండెపోటు మరణాలూ సంభవి స్తున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్న కారణంగా దీర్ఘకాల రోగుల మరణాల శాతం పెరుగుతుందం టున్నారు. ఇప్పటికీ చినుకు పడలేదు. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిప్పుల కొలిమిలా ఉంది.

ఈ క్రమంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల రీత్యా విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన పలు రాష్టాల్రు వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఐదో తరగతి లోపు పాఠశాలలను ఈ నెల 30 వరకు మూసివేయనుంది. 6 నుంచి 12వ తరగతి వారికి ఉదయం వేళ మాత్రమే పాఠాలు బోధించాలని ఆదేశిం చింది. బిహార్‌లోని పట్నా, మరికొన్ని జిల్లాల్లో ఈ నెల 24 వరకు సెలవులిచ్చారు. గోవా, ఛత్తీస్‌గడ్‌లో ఇప్పటికే సెలవులను పొడిగించారు.

జార్ఖండ్‌లో శనివారం దాకా విద్యాసంస్థలను తెరవలేదు. ఎపిలో ఒంటిపూడ బడులు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈక్రమంలో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది.

తెలంగాణ, తమిళనాడు, ఏపీ, మధ్యప్రదేశ్‌, తూర్పు యూపీ, ఒడిసా, జార్ఖండ్‌, కోస్తాంధ్ర, బిహార్‌, బెంగాల్‌లోని గంగా తీర ప్రాంతంలో తీవ్ర, అతి తీవ్ర వడగాలులు ఉంటాయని వివరించింది. ఈ క్రమంలో మనమంతా ప్రకృతి విధ్వంసం,పర్యావారణ విధ్వంసం, కాలుష్యం వల్ల కలుగుతున్న అనర్థాలపై పాఠాలు నేర్చుకోవాలి. కనీసం ఇప్పటి నుంచి దిద్దుబాటు చర్యలను కఠినంగా అలవాటు చేస్తే ఓ వందేళ్లకు గానీ సమస్యకు పరిష్కారం దొరకదు.

ప్లాస్టిక్‌ మన ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా దీని వినియోగాన్ని తగ్గించుకోపోలేకపోతున్నాం. వీధులు, మురికి కాలువలు ప్లాస్టిక్‌ చెత్తతో నిండుతున్నాయి. ఇటువంటి ప్లాస్టిక్‌ భూమిలో కలవడానికి సుమారు వెయ్యి సంవత్సరాలు పడుతుంది. దీని మూలంగా నేల కాలుష్యం జరిగి భూగర్బ జలాలు విష పూరితం అవుతున్నాయి.

కాల్చితే పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. పర్యావరణ సమతల్యత దెబ్బతిని దీని వలన తరచూ అడవులు కాలిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 8 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ సముద్రాలలో కలుస్తుంది.సముద్ర ఉపరితలంలో 40శాతం ప్లాస్టిక్‌ చెత్తతో కప్పబడి ఉన్నదని, ఇది ఇలా కొనసాగితే 2030 సంవత్సరం నాటికి సముద్రంలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్‌ ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలో వున్న జంతువులు, చేపలు శరీరంలోనికి ప్రవేశించి పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి 619 మిలియన్‌ టన్నులు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పెన్నుల నుండి ఎలక్టాన్రిక్‌ పరికరాలు, బొమ్మలు, ఆహార నిల్వకి ఉపయోగించే కవర్లు, ఆట వస్తువులు పి.వి.సి పైపులు, గ్లాసులు మొదలైన వస్తువులు ప్లాస్టిక్‌తోనే తయారవుతున్నాయి.

ప్లాస్టిక్‌ చౌకగాను, సౌకర్యవంతంగా ఉండడం వలన మన జీవితంలో భాగంగా చేసుకున్నాం. ప్లాస్టిక్‌ వ్యర్థాల వలన మానవునికి, పర్యావరణకి వచ్చే ముప్పు అంతాఇంతా కాదు. ప్లాస్టిక్‌ మన జీవితాలని ఛిన్నాభిన్నం చేస్తున్నదని తెలిసినా ప్రభుత్వాలు వాటిని నిషేధించడం లేదు. ఉత్పత్తుల పై ఆంక్షలు విధించడం లేదు.

దీనిపై ప్రపంచమంతా మేల్కోవాలి. ప్లాస్టిక్‌ వ్యర్థానలు నిషేధించాలి. ప్రలాస్టిక్‌ ఉత్పత్తలను నిషేధించాలి. పర్యావరణ విద్ధ్వంసానికి కారణమవుతున్న చర్యలను నిషేధించాలి. అప్పుడే ఈ భూవ్మిూద మనగలుగుతామని గుర్తించాలి.