Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఈ వయసులో కూడా దుమ్ములేపుతున్న అండర్సన్‌

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఖాతాలో 1,100 వికెట్లు
బర్మింగ్‌హామ్‌,జూన్‌ 19(ఆర్‌ఎన్‌ఎ):  ప్రస్తుతం అండర్సన్‌ వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులో ఏ ఆటగాడైనా రిటైర్‌ అవుతాడు. కానీ అండర్సన్‌ మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ వయసులోనూ ఫిట్‌గా ఉండి, ఫిట్‌నెస్‌ విషయంలో కుర్రాళ్లకు సవాల్‌ విసురుతున్నాడు.

మూడో రోజు ఆటలో ఆస్టేల్రియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ క్యారీని పెవిలియన్‌ చేర్చడం ద్వారా అండర్సన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1,100 వికెట్లను ఖాతాలో వేసుకుని రికార్డును అందుకున్నాడు.

2002లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోకి అరంగేంట్రం చేసిన అండర్సన్‌ ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు.

ఇది కూడా చదవండి…భారీగా పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్

ఇందులో 54 సార్లు 5 వికెట్ల హాల్స్‌, 6 సార్లు 10 వికెట్ల హాల్స్‌ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాలు 7/19.

ఇక అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లోకి 2003లో అడుగుపెట్టిన అండర్సన్‌ ఇప్పటివరకు 180 మ్యాచ్‌లు ఆడి 686 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 32 సార్లు 5 వికెట్ల హాల్స్‌, 3 సార్లు 10 వికెట్ల హాల్స్‌ ఉన్నాయి. అత్యుత్తమ గణాంకాలు 7/42.

అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అండర్సన్‌ మూడో స్థానంలో ఉన్నాడు.