Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు…. ఆణిముత్యాలు

జగన్నాథపురం సర్పంచ్ చంద్రిక.

తాడేపల్లిగూడెం నిజం న్యూస్

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఆణి ముత్యాలగా తయారవుతున్నారని జగన్నాథపురం సర్పంచ్ ఉండ్రాజవరపు. చంద్రిక అన్నారు.

జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ చంద్రిక విద్యార్థులకు మెడల్స్, నగదు ప్రోత్సాహకాలు అందించారు.

ఇది కూడా చదవండి…ఐఐటిలో మెరిసిన గిరి బిడ్డలు…
ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రిక మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్య ప్రభుత్వపాఠశాల్లోనే అందుతుందన్నారు. ఎన్నో ఆధునిక సౌకర్యాలతో చక్కని వాతావరణం ప్రభుత్వపాఠశాల్లోనే ఉన్నాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యనభ్యచించిన విద్యార్థులు ఎంతో మంచి ప్రతిభను కనపరిచి ఇలా మెడల్స్ అందుకోవడం ఆనందంగా ఉందని సర్పంచ్ ఉండ్రాజవరపు. చంద్రిక అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శిలు కె. శ్రీనివాసరావు, ఫణి కుమార్, వార్డు సభ్యులు గోపి, లక్ష్మణరావు, చిన పుల్లారావు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.