మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శుల సమావేశము నిర్వహించటం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి ఇన్చార్జి అధికారి బత్తిన.శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.గౌరవ జిల్లా కలెక్టర్,అడిషనల్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశానుసారం గ్రామాలలో చేపట్టినటువంటి డంపింగ్ యార్డులు,స్మశానవాటికలు, రైతు వేదికలు త్వరిత గతిన పూర్తి చేయాలని మరియు పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలని కోరారు. ఎం.పీ.ఓ తులసి రామ్ మాట్లాడుతూ 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు పార్వతి మాట్లాడుతూ పూర్తి అయినటువంటి రైతు వేదికలకు, డంపింగ్ యార్డ్ ,స్మశాన వాటిక లకు బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపిఓ ప్రమీల,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.