Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వర్షాలు కురవాలని శివాలయంలో మహా అభిషేకము

జమ్మికుంట జూన్ 19 (నిజం చెపుతాం)

సకాలంలో వర్షాలు పడకపోవడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూన్ నెల వచ్చినా ఎండలు మండిపోతుండటం, విత్తనాలు నాటే కాలం దాటి పోతుండటంతో రైతులు ఆందోళన చెంది దేవతలకు మొక్కులను చెల్లించుకుంటున్నారు.

ఈ క్రమంలో  జమ్మికుంట పట్టణం ప్రజలు స్థానిక (బొమ్మలగుడి) శివాలయంలో సోమవారం రోజున వర్షాలు సమృద్ధిగా కురవాలని ఉదయం మహాభిషేకము నిర్వహించారు.

ఇది కూడా చదవండి….ఐఐటిలో మెరిసిన గిరి బిడ్డలు…

భక్తులు అభిషేకములో పాల్గొని గర్భగుడిలో స్వామివారు మునిగెంతవరకు అభిషేకము నిర్వహించారు.  అనంతరం స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

శివాలయంలో మహా అభిషేకమును నిర్వహిస్తే వర్షాలు కురుస్తాయని ప్రజల విశ్వాసం.