ఐఐటిలో మెరిసిన గిరి బిడ్డలు…
ఇంటర్ లో సైతం విజయ ఢంకా *అభినందించిన ఐటిడిఎ పిఓ
చర్ల భద్రాచలం.జూన్19.(నిజంచెపుతాం) జిల్లాలోని గిరిజన
గురుకులాల్లో చదువుతున్న గిరి బిడ్డలు తమ ప్రతిభను చాటారు. ఐఐటీలో సీట్లు సాధించారు. ఇంటర్లో రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ స్థానాల్లో నిలబడ్డారు.
ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ పీవో పోట్రు గౌతం విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు.
ఇందుకు సంబంధించిన.ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో భద్రాచలం గిరిజన గురుకులంకు చెందిన కోర్స లక్ష్మి ఐఐటి ర్యాంకు సాధించింది.
ఈ విద్యార్థినికి ప్రతిష్టాత్మక ఐఐటి కళాశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది.ఇదే కళాశాలలో విద్యను అభ్యసించిన మరో 11 మంది బాలికలు ఐఐటీలో క్వాలిఫై అయ్యారు.
ఇంటర్ ఎచ్ఈసి లో ఎస్టి విభాగంలో జి నవ్య, సి ఎస్ గ్రూపులో కనితి త్రిష, ఏటి గ్రూపులో తాటి కీర్తన, ఐఎం గ్రూపులో లక్ష్మీ సౌభాగ్య, పి ఎస్ టి టి గ్రూపులో సోయం మల్లేశ్వరి రాష్ట్రస్థాయిలోనే గురుకులాల్లో ప్రధమంగా నిలిచారు.
రఘునాధపాలెంలోని ఎస్ఓఈ లో చదివిన ఎస్టి విభాగం నుంచి బి.ప్రవీణ్ ఐఐటీ అడ్వాన్సులో 63 ర్యాంకు పొందారు.జె.బాలాజీ 380 వ ర్యాంక్, డి.శివాజీ 438 వ ర్యాంక్ సాధించగా, 1500 లోపు ర్యాంకు 12 మంది విద్యార్థులు పొందారు.
దమ్మపేటకు చెందిన ఐదుగురు బాలురు ఐఐటి అడ్వాన్సులో ర్యాంకులు పొందారు. మరో ఏడుగురు క్వాలిఫై అయ్యారు. కిన్నెరసాని గురుకులంకు చెందిన బి. చందు ఐఐటీలో సీటు పొందాడు.
మరో నలుగురు క్వాలిఫై అయ్యారు. వీరందరినీ భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో… సోమవారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పోట్రు గౌతమ్ అభినందించారు . జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి గారు మాట్లాడుతూ…గిరిజన బాల బాలికలు దేశ స్థాయి పరీక్షలో సైతం రాణించటం గర్వించ దగ్గ విషయం అన్నారు.
భద్రాచలం ఐటీడీఏ పరిధిలో వివిధ కళాశాలలో చదివిన బాల బాలికలకు జేఈఈ అడ్వాన్సుడ్ లో మొత్తం 18 మందికి డైరెక్ట్ ర్యాంకులు,26 మందికి ప్రిపరేటరీ ర్యాంకులు, ఒకరికి ఆలిండియా ర్యాంకు వచ్చిందని ఇది హర్షించదగ్గ పరిణామం అని పిఓ గారు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. బాల బాలికల ప్రగతికి కృషి చేసిన ఆర్.సి.ఓ, ప్రిన్సిపల్స్, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని కూడా పిఓ గారు అభినందించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటిడిఏ ఏపీఓ జనరల్, గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారి సమన్వయ, డి.డి శ్రీ హెచ్ డేవిడ్ రాజ్ , ఎస్ఓఈ ఖమ్మం ప్రిన్సిపాల్ ఎం. బాలస్వామి ,భద్రాచలం గిరిజన గురుకులం ప్రిన్సిపల్ ఎం దేవదాసు కిన్నెరసాని గురుకులం ప్రిన్సిపాల్ ఎస్. రవికుమార్ దమ్మపేట గురుకులం ప్రిన్సిపాల్ జానూ నాయక్ , లెక్చరర్స్, తల్లిదండ్రులు, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు