ఒక్క రోజు నీరసన దీక్ష తుడుందెబ్బ
వెంకటాపురం మండలం లో ఒక్క రోజు నీరసన దీక్ష తుడుందెబ్బ ఆద్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రెవిన్యూచట్టం మరియు సాదబైనామ,112 జీఓ లను రద్దు చేయాలని ములుగు జిల్లా లోని అన్ని మండల కేంద్రంలో నీరసన దీక్షలు చేస్తున్నారు. దానిలోని భాగంగా వెంకటాపురం లో దీక్ష చేయడం జరిగింది. ప్రభుత్వం ఆదివాసుల మీద సవతి ప్రేమ కూడా చూపడం లేదు ఆదివాసుల హక్కులు నిర్వీర్యం చేస్తోంది కావున ఆదివాసీ ప్రజలు ఉద్యమ లకు సిద్ధంగా ఉండాలి అని తుడుందెబ్బ జిల్లా కోశాధికారి కుచ్చింటి చిరంజీవి అన్నారు ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింత సోమరాజు, మడకం చిట్టిబాబు
కణితి వెంకటకృష్ణ,సిద్దబోయిన సర్వేశ్వరావు,మండల అధ్యక్షుడు గోంది హనుమంతు, మట్టి రమేష్, పాయం వెంకటేష్, వాజీడు మండల కార్యదర్శి కామేష్ తదితరులు పాల్గొన్నారు.