మంచినీళ్ల పండుగ… పట్టణానికి మంచినీళ్లు ఏవి? … నిజం వార్తకు స్పందన.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 18, (నిజం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహిస్తున్న మంచినీళ్ల పండుగ, పట్టణానికి మంచినీళ్లు ఏవి? అన్న శీర్షిక వెబ్ వార్తకు మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ స్పందించారు.
“రాజోలు దగ్గర మెయిన్ పైప్ లైన్ లీకేజీ అవడం వలన మాదిరిపురం దగ్గర మోటార్స్ ఆఫ్ అవ్వడం జరిగింది వాటర్ సప్లై కి అంతరాయం కలుగుతుంది అందరూ గమనించగలరు”
ఇది కూడా చదవండి…పత్తి విత్తనాలు తొందరపడి నాటుకోవద్దు
“మహబూబాబాద్ గాయత్రి గుట్ట వద్ద నవోదయ స్కూల్ ముందు మెయిన్ పైప్ లైన్ పగిలిపోవడం వలన పైన తెలిపిన కాలనీలకు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని” మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
దశాబ్దాల కాలంలో వేసిన పైపులు, పైన రోడ్డు ,24 గంటలు తిరిగే వాహనాలు ,వీటి ఒత్తిడికి గురై పాత పైపులు పలుగుతవి అన్న విషయం మున్సిపాలిటీలు ఉద్యోగం వెలగబెడుతున్న ఇంజనీర్లకు తెలియదా?
50 కోట్ల రూపాయలను పట్టణ అభివృద్ధికి మంజూరు చేసిన సీఎం కేసీఆర్ డబ్బులలో కొంతమేర ఖర్చుపెట్టి పట్టణంలోని నూతన పైపుల వేయిస్తే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు.
ఇప్పటికైనా సదరు మున్సిపాలిటీ కమిషనర్ పైపులు పగిలినవి, రిపేర్లు చేస్తున్నాం అనే వివరణలు ఇవ్వకుండా ఎండాకాలం రాకముందే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆలోచిస్తే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటున్నారు