Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పత్తి విత్తనాలు తొందరపడి నాటుకోవద్దు

మాడ్గుల జూన్ 18( నిజం చెపుతాం):
నైరుతి రుతుపవనాల ప్రవేశం ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటం వలన రాబోయే రెండు రోజులపాటు ఎండలు, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువలన రైతు సోదరులు తొందరపడి పొడి దుక్కిలో పత్తి విత్తనాలు విత్తుకోవద్దు.

రెండు మంచి వర్షాలు (60 సెంటీమీటర్లు) కురిసిన తర్వాత భూమి చల్లబడి అనుకూలంగా మారిన తర్వాతనే పత్తి పంట విత్తుకోవాలి. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో 38 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వేడికి విత్తిన విత్తనాలలో మొలక శాతం తగ్గుతుంది. దీంతో విత్తనాలు వృధా అయిపోయి సాగు ఖర్చు పెరుగుతుంది.

ఇది కూడా చదవండి….నైరుతి కోసం రైతన్నలు ఎదురుచూపు

నీటి సౌకర్యం కింద పత్తి విత్తిన రైతులు కూడా ప్రస్తుతం వీస్తున్న వేడిగాలులు, ఉష్ణోగ్రతల ప్రభావం వలన భూమి తొందరగా ఆరిపోవడం, మొక్కల పెరుగుదల లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారు. తొందరపడి పత్తి విత్తనాలు విత్తుకోవద్దు.

పత్తి పంటను జూలై 15 వరకు విత్తుకోవచ్చు.వర్షాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో, విత్తడం ఆలస్యం అవుతున్న ఈ పరిస్థితుల్లో, తేలిక నేలల్లో మొక్కల సాంద్రత పెంచుకొని దగ్గర దగ్గరగా విత్తుకోవడం మంచిది అని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలియజేశారు