Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నైరుతి కోసం రైతన్నలు ఎదురుచూపు

తొలకరి పలకరింపేదీ.?

వానకాల సీజన్ ఆదిలోనే కష్టాలు.

బోనకల్ జూన్ 18 (నిజం చెబుతాం న్యూస్ ) ఏరువాక పౌర్ణమి వచ్చి వెళ్ళింది. మృగశిర కార్తెలో సగం గడిచిపోయిన ఇప్పటికీ నైరుతి రుతుపవనాల పలకరింపు లేదు తొలకరి పులకరింపు కోసం నిరీక్షణ తప్పడం లేదు, ఫలితంగా ఆదిలోనే అన్నదాతలు కష్టాల కడగండ్లు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నచందంగా వానాకాలం సాగుకు గ్రహణం పడుతుంది

కాలం దాటుతున్న నైరుతి రుతుపవనాల జాడ లేకపోవడంతో ఆశించిన మేర వర్షాలు పడే అవకాశం లేదని రైతుల ఆందోళన చెందుతున్నారు జూన్ నెల సగం అయిపోయిన ఎండ తీవ్రతకు 41 డిగ్రీల ఉష్ణోగ్రత. ఉండటం వేడి గాలులు వియిస్తుండటం అన్నదాతలను మరింతగా ఆవేదనకు గురిచేస్తున్నాయి.

2015 నాటి కరువు పరిస్థితులు పునరావృతమవుతున్నాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పొడి దుక్కుల్లోనే విత్తనాలు. రోహిణి కార్తిలో విత్తనం నాటితే ఈ సమయంలో మొక్క మొలుస్తుందని ఆ మొక్కలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి చీడ పీడలను తట్టుకోవడంతోపాటు పంట దిగుబడులు కూడా గణనీయంగా వస్తాయని రైతులు నమ్ముతారు

ఈ నేపథ్యంలో రోహిణి కార్తె ప్రారంభం కాగానే జిల్లాలో చాలా ప్రాంతాలలో రైతులు పొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు వేశారు ఎప్పటిలాగే వర్షాలు పడితే మొక్కలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు, కానీ ఋతుపవనాల రాక ఆలస్యమై వానలు రాక ఆ విత్తనాలు మట్టిలోనే పొట్లి పోతున్నాయి,

పంట ఆలస్యం అవుతున్న తరుణంలో రైతులు ఆందోళన చెందుతున్నారు, బోర్లు బావుల నీటి ఆధారంగా ఉన్న రైతులు విత్తనాలు నాటి రెండు మూడు రోజులు వ్యవధిలోనే తడులు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు, ప్రస్తుతం ఎండ తీవ్రతకు ఆ ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు, ఎండ తీవ్రత వలన మొక్కలు వాడబడి నేలకొరుగుతున్నాయి, కొన్ని గ్రామాలలో రైతులు భయంతో వరి నారు కూడా పోస్తున్నారు

మొన్నటి వరకు అకాల వర్షాలు వడగండ్ల వాళ్లతో చేతికందిన దశలో పంటలు నష్టపోయినారు, రైతులు ఈ వానాకాలం సీజన్ ప్రారంభంలోనే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ,పంటలు చేతికొచ్చే దశలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే, ముందస్తు పంటను వేయాలని వ్యవసాయ అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి…తహశీల్దార్ పై దాడి చేసిన గిరిజనులు

వానాకాలం పంట సాగును నెలరోజుల ముందు తీసుకొచ్చి జూన్ మూడో వారం కల్ల వరినాట్లు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు, అదే జరిగితే మార్చి నెల వరకు వరి కోతలు వచ్చి అకాల వర్షాల రాళ్లవాన నుంచి కాపాడుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచించి ఉన్నారు.

అయితే రుతుపవనాలు కనపడకపోవడంతో వానాకాలం పంటల సాగు మరింత వెనక్కు వెళ్లే ప్రమాదం ఉందని రైతులు ఆపోతున్నారు. ఇలా సుమారు 18 వేల నుండి 20,000 ఎకరాల వరకు బోనకల్ మండలంలో పత్తి సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలియపరిచారు వాతావరణ పరిస్థితుల్లో ఈ వానాకాలం సీజన్ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

పోడి దిక్కులకు అవసరమైన కనీసం 8 మిమి వర్షపాతం కూడా నమోదు కాలేదు వాస్తవానికి రుతుపవనాల ప్రభావంతో పడే వర్షాలతో పంటలు పండే పరిస్థితి నుంచి తుఫాను ప్రభావంతో వర్షాకాలంలో పంటలు సాగు పరిస్థితి ఏర్పడింది ఐదేళ్లుగా బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో తరచు అల్పపీడనం ఏర్పడి మాత్రమే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బోనకల్ మండలంలో మండల వ్యాప్తంగా వర్షాకాలం పంట సాగు విస్తరణ 18 వేల ఎకరాలు పత్తి పంట ఉందని అధికారులు అంచనా వేశారు గత వానాకాలంలో సుమారు 20 వేల ఎకరాలు పంట సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలియజేశారు.

2000 ఎకరాల్లోని మిర్చి, ఐదు నుండి 800 ఎకరాల్లో వరి పెసర పంటలు సాగు కావచ్చని అధికారులు అంచనా వేశారు అవసరమయ్యే విత్తనాలు ఎరువులు వివరాలను, వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు