జేఈఈలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన చిద్విలాస్ రెడ్డి
*జేఈఈలో మెరిసిన ఆణిముత్యం
సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు, తల్లిదండ్రులు!! మాడ్గుల జూన్ 18( నిజం చెపుతాం ): నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలోని గోదల్ గ్రామానికి చెందిన వావిలాల రాజేశ్వర్ రెడ్డి నాగలక్ష్మి ల కుమారుడు చిద్విలాస్ రెడ్డి హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటు 2023లో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ ఇంజనీరింగ్ పరీక్షలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతు మా స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండలంలోని గోదల్ గ్రామానికి చెందిన మేము రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలంలోని ఇర్విన్, గిరి కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులం ఉపాధ్యాయులుగా పని చేస్తు మా పిల్లలు ఉన్నంత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో హైదరాబాదులోని శిక్షణ ఇప్పిస్తు ఇటీవల నిర్వహించిన అడ్వాన్స్ జేఈఈ ఇంజనీరింగ్ పరీక్షల్లో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని నిజం న్యూస్ కు తెలిపారు.
మాడ్గుల మండలంలోని తోటి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని కుమారుడు జే ఈఈ ఇంజనీరింగ్ లో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు మండలంలోని పలు ఉపాధ్యాయ సంఘాలు వర్షం వ్యక్తం చేశాయి.అదేవిధంగా మా పాఠశాలలో చదివే విద్యార్థులు కూడ మా పిల్లలతో సమానంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము.