Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏకశిలా స్కూల్ లో విచ్చలవిడి ఫీజుల దోపిడినీ అరికట్టాలి….

–ఒక తండ్రి ఆవేదన….

ఫీజుల దోపిడిని అరికట్టకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తాం….

లంబాడా హక్కుల పోరాట సమితి LHPS జిల్లా కన్వీనర్ విష్ణు నాయక్……

మహబూబాబాద్ బ్యూరో జూన్ 18 నిజం న్యూస్

మహబూబాబాద్ పట్టణంలోని ఏకశిలా విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఏ ప్రైవేట్ పాఠశాలలు లో లేని ఫీజులు కేవలం ఏకశిల విద్యాసంస్థల్లో ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు……దిని పై లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ విష్ణు నాయక్ స్పందిస్తూ అదిక ఫీజులు వసూలు చేస్తున్న ఏకశిలా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే దశల వారిగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు…

పుస్తకాలు పేరుతో ఒక విద్యార్థి కి 6 నుండి 7 వేలు వసూలు చేస్తు విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పిలుస్తున్నారు అని విష్ణు నాయక్ అన్నారు…….

ఏకశిలా విద్యాసంస్థలపై జిల్లా విద్యాధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు… వేసవికాలంలో కూడా తరగతుల నిర్వహిస్తూన్న పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు……

అక్షరాలు నేర్పే విద్యాసంస్థలను, అక్షరాలు అమ్మే దుకాణాలుగా మార్చేశారని,…

ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఏకశిల విద్యాసంస్థల పై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దశలవారీగా కార్యక్రమాలు చేస్తామని అన్నారు…

గిరిజన జిల్లాలో అత్యధికంగా గిరిజన పిల్లలు ఎక్కువ ఉంటారని, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న జిల్లా మానుకోట జిల్లా కావడం తో, పిల్లలు కు మంచి విద్య పేరుతో మోసం చేస్తున్నారు అని…

ఈ జిల్లాలో అలాంటి వారికి ఛాన్స్ లేదు అని విష్ణు నాయక్ అన్నారు…

లంబాడా గిరిజనుల సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు…