అటవీశాఖ భూములను పరిశీలించిన డిఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్! ఒంటి గుడిసె సమీపంలో సర్వే నెంబర్, 250 ప్రాంతాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ మంగళవారం పరిశీలించారు. దుమ్మగూడెం, అశ్వాపురం, తదితర ప్రాంతాలలో అటవీశాఖ భూములు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణాలతో అటవీ శాఖ భూములను కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ భూమిని అటవీ శాఖకు కేటాయించాల్సి ఉండడం తో 250 సర్వే నెంబర్ లోని రెవిన్యూ భూమిని. కూడా జిల్లా అటవీ శాఖ అధికారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డి ఓ అప్పయ్య, ఎఫ్ఆర్ఓ నాగసాయి ప్రసాద్, డిఆర్ఓ ధనలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.