సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తోన్న సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్
విస్సాకోడేరు సర్పంచ్ సూపర్ .
* నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుకు కృషి
* పంచాయతీ వాసులకు కరెంట్ కష్టాల నుంచి విముక్తి.
* సర్పంచ్ ను సన్మానించిన పంచాయతీ వాసులు.
చిత్రాడ. నూకేష్
ఆంద్రప్రదేశ్ బ్యూరో
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విస్సాకోడేరు పంచాయతీ సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్ ప్రజల కష్టాలను తన కష్టాలగా భావించి వెంటనే పరిష్కరిస్తూ అక్కడ ప్రజల మన్ననలందుకుంటున్నారు.
విస్సాకోడేరు పంచాయతీలో విద్యుత్ కష్టాలు విపరీతంగా ఉండేవి. లో వోల్టేజ్ సమస్య తో ప్రజల కష్టాలు వర్ణనాతీతం గా ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్ పంచాయతీ లో విద్యుత్ సరఫరా కు తగ్గ ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుందని గ్రహించి వెంటనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కలిసి సమస్యను వివరించారు.
ఇది కూడా చదవండి….మొదటి రోజు 100 కోట్లను దాటిన ఇండియన్ సినిమాలివే
దీంతో అధికారులు స్పందించి వెంటనే చర్యలు ప్రారంభించారు. సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్ సహకారంతో పంచాయతీ లో ఏకంగా నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 163,100,63,40,కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో ఎప్పటి నుంచో ఉన్న విద్యుత్ కష్టాలు తీరాయి. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ సర్పంచ్ చొరవ వలనే ఈ సమస్య పరిష్కారం అయిందని అన్నారు.
పంచాయతీ లో సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తోన్న సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్ ను, విద్యుత్ శాఖ అధికారులను పంచాయతీ ప్రజలు సన్మానించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సర్పంచ్ బొల్లా. శ్రీనివాస్ ను అభినందించారు.