Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మైనింగ్ మాఫియా ఉరుకులు 

నేరేడుచర్ల జూన్ 17(నిజం చెపుతాం న్యూస్ ):

నేరేడుచర్ల మున్సిపాలిటీలో దర్జాగా మైనింగ్ మాఫియా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు పాత నేరేడుచర్ల నుంచి మట్టి ట్రాక్టర్లు వందకు పైగా రోజు తిరుగుతున్నాయి

చెరువు మట్టి కోసం ఉదయం సాయంత్రం నైట్ తెల్లవార్లు పాత నేరేడుచర్ల రోడ్డు రామాపురం రోడ్డులో ఇస్తానుసారంగా మట్టి టిప్పర్లతోలుతూ టూ వీలర్స్ సైడ్ ఇవ్వకుండా ఆరం కొట్టిన టిప్పర్ల వాళ్ళు పట్టించుకోకుండా నడిరోడ్డుపై జన సందేహం ఉన్న మట్టి ట్రాక్టర్లు టిప్పర్లు డ్రైవర్లు ఇస్తానుసారంగా టేప్ రికార్డులు పెట్టి నడిచే వారికి దారి లేకుండా టూవీలర్లు పోకుండా అంబులెన్స్ వచ్చినా సైడ్ ఇవ్వకుండా రామాపురం రోడ్డులో దుమ్మెత్తి షాపుల నిండా నింది పాత నేరేడుచర్ల విద్యానగర్ లో ఇండ్ల నిండా దుమ్ము పడుతుంది

ఇది కూడా చదవండి…ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణా కాంగ్రెస్ దూకుడు

మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నేరేడుచర్ల పట్టణంలో ట్రాక్టర్ల డ్రైవర్లు టిప్పర్ల డ్రైవర్లు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ సైడ్ ఇవ్వమంటే ఇవ్వనందుకు టిప్పర్ల వాళ్ళు టూ వీలర్ వాళ్లతో గొడవలు పెట్టుకుంటున్నారు కానీ నేరేడుచర్ల మున్సిపాలిటీ వారు కానీ మైనింగ్ శాఖ వారు కాని పోలీసులు కానీ పట్టించుకోవటం లేదు మాకెందుకులే అని అధికారులు కాలం వెళ్లబుచ్చుతున్నారు

శనివారం ట్రాక్టర్ ఒకటి బోల్తాపడి డ్రైవర్ కి గాయాలయ్యాయి అదే సమయంలో సైకిల్ మీద ఒక వ్యక్తి పోతుంటే అతను పక్కకు పోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది
ఇకనైనా నేరేడుచర్ల మున్సిపాలిటీ వారు మైనింగ్ శాఖ వారు పోలీస్ శాఖ వారు మట్టి టిప్పర్లని టాక్టర్ ల ని అదుపు చేయవలసిందిగా నేరేడుచర్ల మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు