Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉద్యాన డిప్లొమా కోర్సు కు ఈనెల 30వరకు దరఖాస్తుల గడువు

గరిడేపల్లి జూన్ 17 (నిజం చెబుతాం) . .. రెండు సంవత్సరాల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సు చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు, సిద్దిపేట జిల్లా వారు ఉద్యాన డిప్లొమా కోర్సు ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పదో తరగతి పాస్ లేదా పాలీసెట్ అర్హత లేదా ఇంటర్ ఫెయిల్ వారు ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈనెల జూన్ 30 వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు అనీ అరోబిందో కృషి విజ్ఞాన కేంద్రం, గడ్డిపల్లి, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి, బి. లవ కుమార్ తెలియజేశారు.

ప్రస్తుతం మన రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు ఉన్నాయి, మన సూర్యాపేట జిల్లా లో ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు పరిధిలోని అనుబంధిత పాలిటెక్నిక్ ఈ సంవత్సరం నుండి గరిడేపల్లి మండలం, గడ్డిపల్లి గ్రామం డాక్టర్ ఘంటా గోపాల్ రెడ్డి ఉద్యాన హార్టికల్చర్‌ పాలిటెక్నిక్ కళాశాలను, ఏర్పాటు చేయటం జరిగింది.

ఈ ఉద్యాన డిప్లొమా పాలిటెక్నిక్ కళాశాలలో 40 సీట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్ ప్రవేశపరీక్ష ద్వారా 15 శాతం మందికి ఉద్యాన బీఎస్సీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. *దరఖాస్తుకు కావాలసి సర్టిఫికెట్స్* 10 వ తరగతి మార్క్స్ మెమో,

కుల ధ్రువీకరణ పత్రము, ఆదాయ పత్రము, నాన్ మున్సిపాలిటీ పత్రము, ఆధార్ కార్డ్, పాస్ ఫోటో. వివరాల కోసం సిహెచ్ నరేష్ ఉద్యాన శాస్త్ర వేత్త 9603268682, 7893989055, 9948644414, మరిన్ని వివరాలకు www.skltshu.ac.in సంప్రదించాలని చెప్పారు.