తెలంగాణలో దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా: సబితాఇంద్రారెడ్డి*

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలు కారణంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్లున్నట్లు మంత్రి తెలిపారు.గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు, వరదలు కారణంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా దసరా వరకు జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నామని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రకటించారు. త్వరలోనే పరీక్షల కొత్త తేదీలను ప్రకటిస్తామని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.