Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవు

కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో జనవాణి.

తమకు జరిగిన అన్యాయాలపై పవన్ కళ్యాణ్ కు చెప్పుకున్న బాధితులు

చిత్రాడ. నూకేష్ ఏపీ బ్యూరో

కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేనాని నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఎంతో మంది తమకు జరిగిన అన్యాయాల గురించి తమతమ గోడును జనసేనాని పవన్ కళ్యాణ్ కు వినిపించారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో కనీస సౌకర్యాలు కూడా లేవని ఉచితంగా వైద్య పరీక్షలు చేయాల్సి ఉన్నా ప్రైవేట్ గా చేయించుకోవాలని చెబుతున్నారని పేషెంట్స్ ను హీనంగా చూస్తున్నారని చాలామంది తమ బాధను వ్యక్తం చేశారు.

Also read: ప్లాస్టిక్ బాటిల్లతో బస్టాండు నిర్మాణం

కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని తాను వికలాంగుడైనా తన పెన్షన్ తొలగించారని తన గోడును వినిపించారు. ఆయనకు వెంటనే ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు.

భూ సమస్యలుపై దృష్టి సారించాలని, కాకినాడ రూరల్ మండలాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని దానిపై స్పందించాలని అక్కడ వాసులు వినతి పత్రాలు అందజేశారు.

సమస్యలపై పవన్ నిలదీసి తమకు న్యాయం చేయాలని చాలా మంది కోరారు. ఎంతోమంది ప్రముఖులు విద్యావంతులు కాకినాడ జిల్లాలో ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ అందరి సమస్యలను ఎంతో ఓపికతో వింటుండడం విశేషం.