Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్లాస్టిక్ బాటిల్లతో బస్టాండు నిర్మాణం

-పలువురిని ఆకట్టుకుంటున్నప్రయాణ ప్రాంగణం ప్రారంభం.

కమలాపూర్ జూన్ 16 ( నిజం చెపుతాం). కాదు ఏది బస్టాండ్ కట్టేందుకు అనర్హం అనే నానునిగా ఒక మంచి ఆలోచన ఇటు పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రయాణికుల సేద తీర్చేందుకు ఒక ప్రాంగణముగా తయారైనటువంటి బస్టాండు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పులపల్లెలో నిర్మించినారు.

కమలాపూర్ మండలం ఎంపీడీవో పల్లవి గారి ఆలోచన గ్రామ సర్పంచ్ బోలేపల్లి ఉమా రవీందర్ గార్ల కృషి వలన బస్టాండును పలువురిని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్ది .అధికారులతో కలిసి చెట్ల ఆకులనే రిబ్బన్ గా ప్రారంభోత్సవం చేశారు

ఇది కూడా చదవండి….తుంగతుర్తి టికెట్ ఇస్తే గెలుపు నాదే 

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉమా రవీందర్ మాట్లాడుతూ గ్రామ సిబ్బంది సహాయంతో సేకరించిన 1200 ప్లాస్టిక్ బాటిల్లను ఉపయోగించి హుజురాబాద్ పరకాల ప్రధాన రహదారిపై ఈ బస్టాండ్ ను నిర్మించామన్నారు.

భవిష్యత్తులో కూడా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ను గ్రామంలో నుంచి సేకరించి మరిన్ని నిర్మాణాలు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ జగదీశ్వర్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ జెడ్పిటిసి కళ్యాణి లక్ష్మణరావు ఎంపీడీవో పల్లవి గ్రామ ప్రజలు  పాల్గొన్నారు