Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కబ్జా కొరల్లో లో దిర్శించర్ల ఊర చెరువు

పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
నేరేడుచర్ల జూన్ 16(నిజం చెపుతాం ):
మండలంలోని దిర్శించర్ల* గ్రామ ఊర చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామంలో అతి పెద్ద కమ్యూనిటీగా ఉన్న ముదిరాజులకు గ్రామ ఊర చెరువు‌ పెద్ద దిక్కుగా ఉండేది.

గత కొన్ని సంవత్సరాలుగా అది కొంతమంది కబ్జా కోరుల చేతుల్లో ఉందని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు.

సర్వేనెంబర్ 52 లో ఉన్న చెరువు మొత్తం విస్తీర్ణం సుమారు 116.26 ఎకరాలు, కాగా సుమారు 60 ఎకరాల విస్తీర్ణం గల చెరువు శిఖం భూమి ఒకవేళ ఆక్రమణ గురికాకుండా ఉంటే విస్తీర్ణం లో ఎక్కువగా ఉండి నీరు సమృద్ధిగా ఉండేదని, ప్రజా శ్రేయస్సుకోసం నీరు ఉండాలని ఎవరైతే ఎలాగైతే అనుకుంటున్నారో కబ్జా గురైన మొత్తం చెరువు భూమి ఉండి ఉంటే నీరు ఎక్కువగా ఉండి గ్రామ ప్రజల మరియు రైతుల అవసరాలు తీర్చే విధంగా ఉండేదని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి…..ఆగస్టు 31లోగా ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు తెలపాలి

ఆక్రమణదారుల్లో కొంతమంది గ్రామ శ్రేయస్సు దృశ్య ఆక్రమించిన భూమిని తిరిగి ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు వినికిడి. సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని కబ్జాకు గురైన సంబంధిత చెరువు శిఖాన్ని కాపాడాలంటున్నారు.