ఆగస్టు 31లోగా ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు తెలపాలి
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 16, (నిజం న్యూస్):
జిల్లా ఓటర్ల జాబితా ముసాయిదాను ఆగస్టు రెండో తేదీన ముద్రించి అందించడం జరుగుతుందని, అట్టి జాబితాపై అభ్యంతరాలను ఆగస్టు 31వ తేదీలోగా అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక అఖిలపక్ష పార్టీ ప్రతినిధులను కోరారు.
జిల్లా సమీకృత భవనం ఐడిఓసి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఓటరు జాబితా ముసాయిదా ముద్రణపై అఖిలపక్ష పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ,ఓటర్ల జాబితా ముసాయిదా పై అఖిలపక్ష పార్టీ ప్రతినిధులు అభ్యంతరాలను తెలపాలని కోరారు.ఆగస్టు 2వ తేదీన ఓటరు జాబితాను ముద్రించి పార్టీ ప్రతినిధులకు అందించడం జరుగుతుంధి. అట్టి జాబితా ముసాయిదా పై ఆగస్టు 31వ తేదీలోగా అభ్యంతరాలు అందించవచ్చునని తెలియజేశారు.
సెప్టెంబర్ 22 వరకు క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ స్వీకరించడం జరుగుతుందన్నారు .సెప్టెంబర్ 29న సప్లమెంటరీ ఓటర్ జాబితా రూపొందించడం జరుగుతుందన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా ముద్రించడం జరుగుతుందన్నారు.అర్హులైన వారిచే ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేయించాలన్నారు,
అదేవిధంగా వారి పేరు సరిచూసుకోవాలని అలాగే చిరునామా ఇంటి నెంబరు వంటివి పొరపాట్లను దరఖాస్తు ద్వారా అందజేసి సరి చేయించుకోవచ్చునన్నారు. మృతుల ఓట్లు తొలగించడం జరిగిందని వలసలు, మహిళలు వివాహాలు చేసుకుని వెళ్లిపోయిన వారు, బదిలీ అయిన వారు ఓటర్ల వివరాలు పరిశీలించాలన్నారు.
ఇది కూడా చదవండి…ఆసియా కప్‌కు అందుబాటులో బుమ్రా, శ్రేయస్ అయ్యర్
జూన్ 26 నుండి ఆగస్టు 2వ తారీఖు వరకు ఈవీఎం మిషన్ల పరిశీలన కార్యక్రమం చేపడుతున్నందున అఖిలపక్ష పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రతి మిషను వెయ్యి ఓట్లు కచ్చితంగా పడుతున్నాయా లేవా పరిశీలించుకోవాలన్నారు, జిల్లాలో 531 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు బిఎల్వోలు ఉన్నారని, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు 50 నుండి 60 డోర్ టు డోర్ సర్వే చేయాలని ఆదేశించామన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్లో 1200 నుండి 1500 వరకు ఓటర్ల జాబితా ఉంటుందన్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.