Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆసియా కప్‌కు అందుబాటులో బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌

– కోలుకుంటున్న గాయపడ్డ క్రికెటర్లు
గాయాల పాలైన ఆటగాళ్లు వేగంగా కోలుకుంటున్నారు. జస్పీత్ర్‌ బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌ ఆసియాకప్‌`2023కి అందుబాటులో ఉంటారని తెలిసింది.

రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్‌ పంత్‌ తన రికవరీతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు వెన్నెముకగా మారాడు జస్పీత్ర్‌ బుమ్రా ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. వెన్నెముక గాయంతో 2022 సెప్టెంబర్‌ నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు.

ఇది కూడా చదవండి….ఈసారి వరల్డ్‌ కప్‌ మాదే

బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దిగువ వెన్నెముక గాయంతో ఏప్రిల్‌లో క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు.

ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్‌ పొందుతున్నాడు. మొత్తానికి వీరిద్దరినీ సెప్టెంబర్‌లో ఆసియాకప్‌`2023కి సిద్ధం చేయాలని ఎన్‌సీఏ మేనేజ్‌మెంట్‌ పట్టుదలగా ఉంది.

ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో పంత్‌ను ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేయాలని బోర్డు పట్టుదలతో ఉంది.  రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్‌ ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు. క్రచెస్‌ లేకుండా మెట్లు ఎక్కుతున్నాడు.