Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రామాయణంను వేరేలా చూపించిన ఓం రౌత్‌

ఏ రామాయణం లో కూడా లేని సన్నివేశాలని ఓం రౌత్‌ కొత్తగా సృష్టించాడు.  వానర సైన్యం లో ఒక్క హనుమ తప్పు మిగతా వాళ్ళు అందరూ ఎదో వింత జంతువుల్లా చూపించాడు. సుగ్రీవుడిని కూడా ఎదో వింత జంతువులా చూపించాడు.

మరి రావణాసురుడిని అయితే మరీ హాలీవుడ్‌ సినిమాలో విలన్‌ లా చూపించాడు. లంక ఎంత అందంగా వర్ణించారు రామాయణంలో, అటువంటి లంకని హాలీవుడ్‌ సినిమాలో చూపించినట్టు ఒక వికృత పట్టణం, అందులో వికృతంగా వుండే ఆ వింత మనుషులు కనిపిస్తారు.

రావణుడు సీతను ఎత్తుకుపోతుంటే రాముడు చూస్తాడు. చూసి పరిగెడుతూ ఉంటాడు. రాముడు చూస్తే వెంటనే బాణం వేసి రావణుడిని ఆపాలి ..ఆపితే రామాయణ కథ అక్కడితో ఆగిపోవాలి.

హనుమ సముద్ర లంఘనం చేసి లంకకి వెళ్లి సీతమ్మవారి కనపడేటట్టు చెట్టు విూద నుండి ఉంగరం కింద పడేస్తాడు. అలాగే హనుమంతుడు సీతతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది రాక్షసులు చూస్తారు. సీత ముందే హనుమంతుడు రాక్షసులకు మధ్య యుద్ధం. ఇదెక్కడి రామాయణంలో ఉందో తెలియదు.

సీతమ్మ దర్శనం అయ్యాక లంకలో విశేషాలను తెలుసుకోవడానికి స్వామి హనుమ అశోక వనాన్ని కావాలనే ధ్వంసం చేస్తే, అక్కడకి రాక్షసులు వస్తారు. అది అందరికి తెలిసిన విషయం.

ఇది కూడా చదవండి…అవతార్‌ సిరీస్‌ వాయిదా

వాలి సుగ్రీవులు ఇద్దరూ ఒకేలా వుంటారు, అందుకని సుగ్రీవుడు వాలిని యుద్దానికి పిలిచి ఓడిపోయి వెనక్కి వస్తే, రాముడు ఇద్దరూ ఒకేలా వున్నారు, ఆ విషయం నాకు తెలీదు, అందుకని సుగ్రీవుడి మెడలో ఒక పూల దండ వేసి యుద్ధనికి వెళ్ళమంటారు. అప్పుడు చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తాడు.

ఓం రౌత్‌ తనకి నచ్చిన చీరని సీతకి కట్టించాడు. ఇదేమి వికృతమో. మండోదరి పాత్ర మరీ విచిత్రంగా చూపించాడు. ఒక్క నేపధ్య సంగీతం మాత్రం ఫరవాలేదని పించారు. రాముడు, లక్ష్మణుడు, సీత, రావణుడు, హనుమంతుడు ఇలా పేర్లు పలుకుతాం,

ఈ శేష్‌ ఏంటబ్బా? ఎక్కడ నుండి వచ్చాడు? రాఘవ ఒకే కానీ, రామా అనే అంటాం కదా మనం.