Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జర్నలిస్టులు అంటే అంత అలుసా..

ఉన్నది రాస్తే అంత ఉలికెందుకు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

ఐజేయు మండల అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు, పూర్ణచంద్రరావు, సహదేవ్.

కురవి,నిజం న్యూస్,జూన్,16:

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు కుడితి మహేందర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) మండల అధ్యక్షులు పూర్ణచందర్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బేతమల్ల సహదేవ్ డిమాండ్ చేశారు.

శుక్రవారం వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ నిన్న (గురువారం) మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో మండల బారసా నాయకులు కుడితి మహేందర్రెడ్డి మాట్లాడుతూ..మా ఎమ్మెల్యే విలేకరులు ఏమని అనవద్దు అని అంటే ఊరుకున్నాం,

కానీ ఉరికిచ్చి కొట్టేవాళ్ళం అని,మాకు వ్యతిరేకంగా వార్తలు రాశే వాళ్ళను మీటింగులకే పిలవము అని అన్నాడు. ఆమాట లను వెనుక కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల మీద చేయి చేసి చూడు మీ సంగతేందో చూస్తాం జర్నలిస్టులు అంటే అంత అలుసా అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే జనం తిరగబడ్డది, నిజం కాదా, వీడియోలు ఉన్నాయి మాటలు ఆడియో లు ఉన్నాయి,

Also read: సర్టిఫికెట్ కావాలా…అయితే 500 కొట్టు..!

అన్ని చూసే వార్తలు రాసి యూట్యూబ్ ఛానల్ లో ప్రింట్ మీడియా లో వచ్చినాయి. మీ నాయకుడి మీద ప్రజలు తిరగబడలేదా అసంతృప్తి వ్యక్తం చేయలేదా అని వారు ప్రశ్నించారు. ప్రజలు తిరగబడ్డచోట తిరగబడ్డట్టే రాశాము మంచిగా ఉన్నచోట మంచిగా ఉన్నట్టే రాశము అంతేగాని లేని ఉన్నట్లుగా ఉన్నయి లేనట్లుగా రాయటానికి మాకేం దురద లేదు అని వారు అన్నారు.

ఇప్పటికైనా రిపోర్టర్ అంటే అలుసుగా చూడకుండా జాగ్రత్తగా మాట్లాడాలని వారు హెచ్చరించారు. కుడితి మహేందర్ రెడ్డి బేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టేది లేదని వారు హెచ్చరించారు.

ఈ సమావేశంలో దూదికట్ల రవీంద్ర చారి.పర్షబోయిన మహేష్.గండమాల రోశయ్య. శ్రీనివాస్.వీరన్న తదితరులు పాల్గొన్నారు.