Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సర్టిఫికెట్ కావాలా…అయితే 500 కొట్టు..!

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, జూన్ 16, (నిజం న్యూస్):

ఇది ఎక్కడో కాదు మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ లోని తహసిల్ ఆఫీస్ కార్యాలయంలో, కొందరు ఉద్యోగస్తుల చేతివాటంకు బలి అవుతున్న విద్యార్థులు ,ప్రజలు. విషయానికొస్తే తహశీల్ ఆఫీస్ లో సర్వర్లు గత వారం నుండి పనిచేయడం లేదు అని సంబంధిత ఉద్యోగులు చెబుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

గత వారం నుండి మండలంలోని సర్వర్స్ పనిచేయకపోతే ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు. సర్టిఫికెట్స్ కోసం డబ్బులు ఇచ్చిన వారికి ఉదయమే సర్టిఫికెట్స్ వారి చేతికి ఎలా అందుతున్నాయి.

ఒక్కో సర్టిఫికెట్ కు ఒక్కో రేటు ధర నిర్ణయించి ప్రజల వద్ద నుండి విద్యార్థుల వద్ద నుండి కొందరు ఉద్యోగులు దోచుకుంటున్నారు. ఇందులో పైనుండి కింది వరకు ఎవరి వాటా వారిది. డబ్బులు ఇవ్వని వారి సర్టిఫికెట్స్ వారం తర్వాత రండి సర్వర్లు పనిచేయడం లేదు అని చెప్తున్నట్లు తెలుస్తుంది. తమకు సంబంధించిన వారు డబ్బులు ఇచ్చిన వారిని ఉదయం వచ్చి తీసుకెళ్లండి.

Also read: సీతారామాలయ హుండీ చోరీ

అని రాత్రికి రాత్రి సర్టిఫికెట్స్ ను తయారు చేసి ఉదయం సంబంధీకులకు ఇస్తున్నారని తెలిసింది. ఈ సతంగమంతా వారం రోజుల నుండి జరుగుతున్నట్లు తెలుస్తుంది. పాఠశాలలు కళాశాలలు తెరుస్తున్న ఈ సమయంలో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఎంత ముఖ్యమో వీరికి తెలుసు కాబట్టి సర్వస్ పనిచేయడం లేదని నాటకాలు మొదలుపెట్టారని ప్రజలు అనుకుంటున్నారు.

జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న తహసిల్ ఆఫీసులో వారం నుండి సర్వర్లు పనిచేయకపోతే ఎలా అని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత ఆపరేటర్స్ గత నాలుగు రోజుల నుండి ఎవరు ఆఫీసుకు రావడంలేదని తెలుస్తుంది ఈ విషయంగా తహసిల్దారును సంప్రదిస్తామని ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.