Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీతారామాలయ హుండీ చోరీ

కురవి,నిజం చెపుతాం,జూన్,16:

శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల ఆలయంలోని భక్తులు కానుకలు వేసుకునే హుండీ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు రామాలయ గుడిలోకి చొరబడి ఆలయ హుండీ పగలకొట్టి భక్తులు కానుకలు వేసిన నగదులతో పాటు కానుకలను ఎత్తుకెళ్లినట్టు ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొరివి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.పూజారులతో చర్చించి కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్టు పోలీసు వారు తెలిపారు.కొరవి ఎస్ఐ రాము నాయక్ వివరణ కోరగా సీతారాముల ఆలయంలో చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను నిఘా వేసి పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.