వాట్సప్ లో ఇక నుండి వీడియో మెస్సేజ్
వాట్సాప్ త్వరలో కొత్త స్నాప్‌చాట్ లాంటి ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీంతో వాట్సప్ వినియోగదారులు తమ స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులకు చిన్న వీడియో సందేశాలను పంపడానికి అవకాశం ఉంటుంది.
వాట్సప్ డెవలపర్లు యాప్ బీటా వెర్షన్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. యాప్ బీటా వెర్షన్‌లో వీడియో సందేశాలను రికార్డ్ చేయగల, పంపగల సామర్థ్యం రాబోయే కొన్ని వారాల్లో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.
యాప్‌లో వాయిస్ నోట్‌లను ఎలా పంపుతారో అదే విధంగా కొత్త ఫీచర్‌కు వినియోగదారులు టెక్స్ట్ ఇన్‌పుట్ బాక్స్‌కు కుడి వైపున ఉండే మైక్రోఫోన్ బటన్‌పై నొక్కి పంపవచ్చు.
ఇది కూడా చదవండి….15 ఏళ్ల తర్వాత పాక్‌లో ఆసియా కప్ మ్యాచ్‌లు
యాప్ బీటా వెర్షన్‌లో ఉన్నట్లయితే, మైక్రోఫోన్ బటన్, వీడియో బటన్‌గా మారుతుంది, దానిపై నొక్కితే గరిష్టంగా 60 సెకన్ల నిడివితో వీడియో సందేశాన్ని రికార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టెక్స్ట్ , ఆడియో సందేశాల మాదిరిగానే రాబోయే ఫీచర్‌ని ఉపయోగించి పంపిన వీడియోలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి.
ప్రస్తుతం వీడియో సందేశాలను ఇతర వ్యక్తులకు ఫార్వార్డ్ చేయడం వీలు కాదు.