మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించిన సమతాదళ్ నాయకులు.

మంగపేట మండలంలోని నీలాద్రి పేట గ్రామానికి చెందిన గోగు నరసింహారావు (42) గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి తో బాధపడుతుండగా మంగళవారం నాడు సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ ములుగు జిల్లా సభ్యులతో కలిసి పరామర్శించారు. అనంతరం నరసింహారావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని తక్షణ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. దాంతోపాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి తో ఫోన్లో మాట్లాడి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే చిన్నయ్య సానుకూలంగా స్పందించి ఆపరేషన్ ఖర్చుల నిమిత్తం 5 లక్షల రూపాయలు ఎల్ ఓసి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం విశ్వనాథ్, దుర్గం తిరుపతి, గోగు వెంకటేశ్వర్లు, రామటేంకి మాణిక్యం, జాడి రవి చెన్నూరు సాంబయ్య , కోమల, సుక్కయ్య, రాంబాబు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు