Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

15 ఏళ్ల తర్వాత పాక్‌లో ఆసియా కప్‌ మ్యాచ్‌లు

ఆగస్టు 31న మొదలై సెప్టెంబర్‌ 17వరకు మ్యాచ్‌లు
నాలుగు మ్యాచ్‌లు పాక్‌లో..9 శ్రీలంకలో
ఆసియా కప్‌ 2023  ఆగస్టు 31న మొదలై సెప్టెంబర్‌ 17న ముగియనుంది. వరల్డ్‌ కప్‌నకు ముందు జరగబోయే ఈ టోర్నీలో భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌ తలపడనున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఈ టోర్నమెంట్‌ లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో, మిగతా 9 మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నారు. 2023 ఎడిషన్‌లో రెండు గ్రూపులుగా జట్లు తలపడనున్నాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్‌ ఫోర్‌ దశకు అర్హత సాధిస్తాయి. సూపర్‌ 4 నుంచి రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

ఇది కూడా చదవండి…..హైదరాబాద్‌ లో ఆదిపురుష్‌ షోలు 1000కి పైనే

కొత్త మోడల్‌కు ఆమోదం దక్కడంతో.. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ మ్యాచ్‌లు పాక్‌లో జరగనున్నాయి. 2023 ఆసియా కప్‌లో రెండు గ్రూపులు ఉండనున్నాయి. టాప్‌ రెండు జట్లు సూపర్‌ ఫోర్‌ స్టేజ్‌కు వెళ్తాయి. ఆసియా కప్‌ వేదికల గురించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం చెలరేగింది. పాక్‌కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ ఇటీవల పేర్కొన్నది. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ కొత్త మోడల్‌కు ఓకే చెప్పింది.