Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలుగు రాష్టాల్ర ఆదిపురుష్‌ థియేట్రికల్‌ హక్కులు రూ. 165 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ… రెండు రాష్టాల్ర ఆదిపురుష్‌’ థియేట్రికల్‌ హక్కులను రూ. 165 కోట్లు ప్లస్‌ జీఎస్టీకి పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ తీసుకుంది.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ’అర్జున్‌ రెడ్డి’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేయనున్న ’స్పిరిట్‌’ రైట్స్‌ కూడా తీసుకోనున్నారు.

ఆదిపురుష్‌’ థియేట్రికల్‌ బిజినెస్‌ బాగా జరిగింది. ఆల్‌ ఓవర్‌ వరల్డ్‌ సుమారు 245 కోట్లకు రైట్స్‌ విక్రయించారని సమాచారం. రూ. 250 కోట్లు కలెక్ట్‌ చేస్తే గానీ బ్రేక్‌ ఈవెన్‌ అవ్వదు.

ఇది కూడా చదవండి….అవతార్‌ సిరీస్‌ వాయిదా

ప్రస్తుతం సినిమా విూద ఉన్న హైప్‌ చూస్తే… అన్ని కోట్లు కలెక్ట్‌ చేయడం పెద్ద కష్టం ఏవిూ కాదు. హిట్‌ టాక్‌ వస్తే అంతకు అంత కలెక్ట్‌ చేయవచ్చు కూడా. ఆదిపురుష్‌’ ఫస్ట్‌ టీజర్‌ విడుదలైన తర్వాత బోలెడు విమర్శలు వచ్చాయి.

కొందరు ప్రభాస్‌ అభిమానులు కేసుల పెదవి విరిచారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ అసలు బాలేదని చెప్పుకొచ్చారు. అటువంటి స్టేజి నుంచి సినిమా విూద హైప్‌ నెలకొందంటే… ఆ పాటలు, ట్రైలర్‌ కారణం.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ విూద చిత్ర బృందం గట్టిగా వర్క్‌ చేసింది. ఏడెనిమిది నెలలు ఓం రౌత్‌ అండ్‌ టీమ్‌ నిద్రపోలేదని తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ప్రభాస్‌ వ్యాఖ్యానించారు. ’జై శ్రీరామ్‌’ సాంగ్‌ హిట్‌ కావడం కూడా కలిసి వచ్చింది.