Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీసులకు చిక్కిన డిక్కీ దొంగలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం , జూన్ 15,( నిజం చెపుతాం ) బ్యూరో:: జూన్ 8వ తేదీ మధ్యాహ్నం మాచవరం గ్రామానికి చెందిన నల్లమిల్లి దారారెడ్డి అను వ్యక్తి తన రైస్ మిల్లులోని రైతులకు డబ్బులు ఇవ్వడం కోసం రామచంద్రపురం స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకుల నందు 3 లక్షల 55 వేలు రూపాయలు విత్ డ్రా చేసుకుని

తన హెూండా యాక్టివా మోటార్ సైకిల్ డిక్కిలో పెట్టుకుని రామచంద్రపురం పట్టణం మెయిన్ రోడ్ లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్ళేం దుకు పార్కింగ్ ప్లేస్ లో తన మోటార్ సైకిల్ ను పార్క్ చేసి ఎటిఎంకు వెళ్లగా ఇంతలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు అతని మోటార్ సైకిల్ డిక్కి నందు ఉంచిన 3 లక్షల 55 వేల రూపాయలు దొంగతనం చేశారన్న ఫిర్యాదు పై రామచంద్రపురం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి…ఆలయ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పి ఎస్. శ్రీధర్ సూచనల మేరకు, రామచంద్రపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి టీఎస్ ఆర్కే ప్రసాద్ పర్యవేక్షణలో, సిఐ శ్రీ వి దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్ఐ డి. సురేష్ బాబు దర్యాప్తు చేసి, గురువారం ముద్దాయిల గురించి వచ్చిన సమాచారం పై పసలపూడి Y జంక్షన్ వద్ద వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసి సిటి 100 మోటార్ సైకిల్ పై మండపేట వైపు నుండి వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా

వారి పేర్లు 1. ముఖేష్ కుమార్ S/O కిషోర్ లాల్, బితురా గ్రామం,గొండ జిల్లా,ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2. రోహిత్ కుమార్ s/o హరీష్ చంద్ర, బంగై గ్రామం,గొండ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లు అనీ…. వారు సీలింగ్ పని నిమిత్తం వచ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన వేరే స్నేహితులతో కలిసి మండపేట దగ్గరలోని తాపేశ్వరం వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ గతంలో పాలకొల్లు, అమలాపురం, మండపేట ఏరియాలో డిక్కీ దొంగతనాలు చేసినట్లు తెలిపారు.

అలాగే ఈ నెల 8 వ తేదీన దొంగతనం చేసినందుకై రామచంద్రపురం స్టేట్ బ్యాంకు వద్దకు వచ్చి డబ్బులు విత్ డ్రా చేయు వ్యక్తులను గమనిస్తూ ఉండగా ఒక వ్యక్తి ఎక్కువ మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేయడం చూసి అతని వెంట పడ్డారు. అతను హెన్డిఎఫ్సీ బ్యాంకు వద్ద కూడా డబ్బులు విత్ డ్రా చేసి తన హెూండా యాక్టివా మోటార్ సైకిల్ డిక్కీలో డబ్బులు పెట్టుకుని ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ వద్ద పార్క్ చేసుకుని ఏటీఎం వద్దకు వెళ్లగా మేము నకిలీ తాళంతో డిక్కీ ఓపెన్ చేసి డబ్బులు దొంగిలించామని చెప్పారు.

దాంతో ఎస్ఐ వారిని రామచంద్రపురం పిఎస్ డిక్కీ దొంగతనం కేసులో ముద్దాయిలుగా గుర్తించి వారి వద్ద నుండి తాపేశ్వరం రూములో దాచిన దొంగలించిన సొమ్ము మూడు లక్షల 55 వేల రూపాయలను రికవరీ చేసి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగినది.

ఈ కేసును చాకచక్యంగా, మరింత త్వరితగతిన ఛేదించిన సీఐ వి దుర్గారావు, ఎస్సై డి సురేష్ బాబు, హెడ్ కానిస్టేబుల్స్ వీరబాబు, మల్లిఖార్జునరావు, కానిస్టేబుల్స్ జగదీష్, సూరిబాబు, అనిల్ , హెూంగార్డ్ మహేష్ లను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్,  అభినందించారు.