Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆలయ భూములు ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు

దేవాధాయశాఖ ఈ ఓ వేణుగోపాల్

జగిత్యాల, జూన్ 15(నిజం చెపుతాం )

దేవాలయ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి పి. వేణుగోపాల్ హెచ్చరించారు.
జగిత్యాల పట్టణము విద్యానగర్ లో గల శ్రీ రామ మందిరం యొక్క 476,477,479,480,481 సర్వే నెంబర్లలో విస్తీర్ణం 9-09 ఎకరాల భూమిలో గురువారం ఆలయ ఈఓ పి. వేణుగోపాల్, ఆలయ చైర్మన్ కాశెట్టి తిరుపతి ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి…..వాహనాలు తీసుకెళ్లండి
ఈ సందర్బంగా దేవాదాయ శాఖ ఈ.ఓ పి.వేణుగోపాల్ మాట్లాడుతూ దేవాలయ భూములలో అక్రమణలకు, అక్రమ దారులకు చోటు లేదని చెబుతూ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు.
అక్రమ దారులపై శాఖపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాయ దేవాలయ రేనోవేషన్ కమిటీ సభ్యులు నర్సింగరావు , రాజేశ్వర్ రెడ్డి, శంకర్, గోపాల్ నాయక్ దేవాదాయ శాఖ సిబ్బంది కోండ్ర రవి, భార్గవ్ , అర్చకులు గోపాల్ , శశాంక్ , మౌళి తదితరులు పాల్గొన్నారు.