Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

శ్రీనిధి లోన్లు తీసుకున్నారు.. కట్టడం లేదు..?

వెంపటి సంఘ బంధంలోని సుమారు 150000 వేల రూపాయలు వాడుకున్న సీసీ ఇదయ పై ఆరోపణ…

న్యాయం చేయాలని వి బి కే విజయలక్ష్మి కలెక్టర్కు వేడుకోలు…

తుంగతుర్తి జూన్ 15 నిజం చెబుతాం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళల ప్రయోజనాల దృష్ట్యా ప్రతి సంఘంలో సంఘ బంధాలకు ప్రభుత్వము ప్రత్యేక లోన్లు మంజూరు చేస్తూ అభివృద్ధి చెందుతున్న గరుణంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో సుమారు 72 సంఘాలు సంఘ బంధంలో పనిచేస్తున్నాయి.2015 16 సంవత్సరానికి గాను ఒక్కొక్క సంఘ బంధానికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల నోన్లు వచ్చాయి.

దీనితో ప్రతి సంఘంలో ఉన్న సభ్యులు లోన్లు తీసుకున్నారు. కొన్ని సంఘాల సభ్యులు లోన్లు తిరిగి కట్టకపోవడంతో మూలిగే నక్క పై తాటి పండు చందంగా మారినట్లు ప్రస్తుతం పరిస్థితులు తయారైంది. ఈ గ్రామానికి సీసీ ఇద్దయ్య పర్యవేక్షణలో నడుస్తున్నది. ఈ సంఘాలకు వి బి కే గా దుబ్బాక విజయలక్ష్మి చలామణి అవుతున్నది .

ఇది కూడా చదవండి…హరితహారం మొక్కలు అగ్గి పాలు

2021…2022 గాను మార్కెట్ ధాన్యం కొనుగోలు మొత్తం కమిషన్ మొత్తం 4 లక్షల రూపాయల రాధా ఈ డబ్బులు మొత్తం సీసీ శ్రీనిధిలో లో వేయించి, తిరిగి లోన్లు మంజూరు చేశారు. సుమారు 11 సంఘాలు ప్రస్తుతం గత కొంత కాలం నుండి లోన్లు కట్టకపోవడంతో నాలుగు లక్షల రూపాయలు సభ్యులపై ఉన్నాయి.

కొన్ని సంఘాల డబ్బులను శ్రీనిధిలో వేయకుండా సీసీ ఇద్దయ్య మార్ఫింగ్ చేయడంతో సుమారు ఒక లక్ష యాభై వేల రూపాయలు అతని వ్యక్తిగతంగా వాడుకున్నట్లు స్థానిక వి బి కే ఆరోపిస్తున్నారు.

ఈనెల 20న బీబీకే నాలుగు లక్షల రూపాయల కట్టాలని సిసి హుకుం జారీ చేయడంతో, అసలు అవినీతి బయటపడ్డది. జరిగిన సంఘటనపై గతంలో పలుమార్లు డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ కూడా తెలియపరచినట్లు ఆమె పేర్కొన్నారు.

జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి , సంబంధిత అధికారులు లోన్లు రికవరీ చేసి, తనకు న్యాయం చేయాలని వెంపటి వి బి కే దుబ్బాక విజయలక్ష్మి కోరుతున్నారు….