బంగారు ఆంధ్ర ప్రదేశ్ గా మారుస్తా…
– *జనసేనాని* *పవన్* *కళ్యాణ్
జూన్ 15.. నిజం చెపుతాం న్యూస్..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా సాగుతుంది.ప్రజలు ప్రత్యేకించి యువత పవన్ కు బ్రహ్మా రధం పడుతున్నారు.ఈ సందర్బంగా కాకినాడ జిల్లా చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చాయని విశ్లేషకులు అంటున్నారు. సెరీకల్చర్ రైతులు, చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పవన్ మాట్లాడుతూ 2024,2029ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ను బంగారు ఆంధ్రప్రదేశ్ గా మారుస్తానని, ఒకవేళ తన పని తీరు నచ్చకపోతే మొదటి రెండు సంవత్సరాలలో తనను రీకాల్ చేయవచ్చని,తానే ముఖ్యమంత్రి పదవి నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటానని పేర్కొన్నారు.పవన్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో చర్చకు దారి తీసాయి.