సాదాబై నామా భూముల రెగ్యూలరైజ్ చేసుకొండి -తహశీల్దార్ బాబ్జి ప్రసాద్
తెలంగాణా ప్రభుత్వం 02 వ జూన్ 2014 తేది కంటే ముందు సాదాబై నామా ద్వారా కొనుగోలు చేసిన భూములకు రెగ్యూలరైజ్ చేసుకొనుటకు ఆదేశాలు ఇవ్వనైనదని మంగపేట తాశిల్ధార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈరోజు నుండి నిర్దిష్ట నమూనా లో మీ సేవ లో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు అని ఎమ్మెర్వో బాబ్జి ప్రసాద్ తెలిపారు. దరఖాస్తు చివరి తేది 31 అక్టోబర్ 2020 వరకు ఉంటుందని కావున ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకోగలరని వారు అన్నారు.