Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఐటి అధికారుల సోదాలు.. నేతల్లో టెన్షన్

హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు విసృతంగా కొనసాగాయి. బుధవారం ఉదయం నుంచి సుమారు 50 ఐటీ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిఇంచాయి. హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపినట్లు తెలుస్తోంది..

పన్ను చెల్లింపులకు సబంధించి వివిధ పత్రాలను ఐటీ బృందాలు తనిఖీ చేసాయని, ఇందులో కీలక పర్తాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు నగరంలోని వివిధ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు జరిగినట్లు సమాచారం.

Also read: బాసర ట్రిపుల్ ఐటిలో వరుస బలవన్మరణాలు

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుండి హైదారాబాద్ లోని చైతన్యపురిలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో… ఆఫీస్‌లలో సోదాలుకొనసాగుతున్నట్లు తెలుస్తోంది.. భువనగిరిలోని ఎమ్మెల్యే సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగాయని అనధికార సమాచారం. గత కొంతకాలంగా ఈట్ శాఖా అధికారులు ఎమ్మెల్యే పైళ్ళ వ్యాపారం, ఆదాయం మీద ఫోకస్ పెట్టారు.

హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో సోదాలు చేస్తున్నారు.ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక‌లో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికా‌లో మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.

అయితే తమకు లభించిన పక్కా ఆధారాల ప్రకారమే చట్టాలకు లోబడి తనిఖీలు చెస్తున్నట్లు ఆదాయపు అధికార వర్గాల సమాచారం కాగా తమను రాజకీయంగా వేధించేందుకే ఈ తనిఖీలు అంటూ అధికార బి ఆర్ ఎస్ ప్రతినిధులు ఫైర్ అవుతున్నారు.

ఈ సోదాల వ్యవహారం తిరిగి తిరిగి ఎవరి మెడపై పడుతుందో అని అనేక ఎమ్మెల్యెలలో టెన్షన్ మొదలయ్యిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

సాయిప్రతాప్