Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాసర ట్రిపుల్ ఐటిలో వరుస బలవన్మరణాలు

*మొన్న దీపిక…నిన్న లిఖిత*

*ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి, జూన్ 15(నిజం చెపుతాం)

*నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని బాసర ట్రిపుల్ ఐటిలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతోంది. దీపిక ఆత్మహత్య మరువక ముందే రెండో రోజు మరో విద్యార్థిని లిఖిత ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపింది. రెండురోజులు క్రితం పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత(17) అనే విద్యార్థిని వసతి గృహంలోని నాలగవ అంతస్తు నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే, లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు..ప్రమాదమాలేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్, బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె గజ్వేల్లో మిర్చిబండి నిర్వహిస్తూ.. రాజు పిల్లలను చదివిస్తున్నారు. వారం రోజుల క్రితమే లిఖిత హాస్టల్కు వెళ్లిందని.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.*

*బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి..?*

*దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో ఎక్కడా జరగని విద్యార్థుల ఆత్మహత్యలు కేవలం బాసర ట్రిపుల్ ఐటీ లో మాత్రమే జరగడం ఏమిటని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి ప్రశ్నించారు. గురువారం ఆమె ట్రిపుల్ ఐటీ ని సందర్శించేందుకు వెళ్లగా పోలీసులు ఆమెను అరెస్టు చేసి లోకేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆమె లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ 48 గంటల వ్యవధిలోనే ఇరువురు విద్యార్థినుల ఆత్మహత్యలకు పాల్పడడం దారుణమని, రాష్ట్ర ప్రభుత్వం ఆ విద్యాలయంలో సరైన వసతులు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ಒತ್ತಿದೆಕಿ గురై ఆత్మహత్యలకు Conversations అనుమానం వ్యక్తం చేశారు.