Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మా ఎమ్మెల్యే ఊరుకోమంటేనే ఊరుకుంటున్నాము… లేకుంటే

మీడియా పై అనుచిత వ్యాఖ్యలు…

మహబూబాబాద్ బ్యూరో జూన్ 15 నిజం న్యూస్

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మీడియా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకులు కుడితి మహేందర్ రెడ్డి… తానంచర్ల , మూలమర్రితండా, గ్రామంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ను ప్రజలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేయడంతో ఆ దృశ్యాలను, మీడియా ప్రపంచానికి తెలియచేసింది..

ఈ విషయం పై బీఆర్ఎస్ నాయకులు మరిపెడ మండలం బావోజి గూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రధాన అనుచరుడు కుడితి మహేందర్ రెడ్డి, మీడియాను బెదిరించారు

మా ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఊరుకోమంటేనే ఊరుకుంటున్నాము లేకుంటే ఒక్కొక్కరి అంతు చూస్తామని ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు ఎవరైనా వ్యతిరేకంగా వార్త రాసే బీఆర్ఎస్ సమావేశానికి రానీయమని హెచ్చరించారు..