తన భర్త మృతి పట్ల అనుమానం ఉంది…
భర్త మిత్రుని ఇంటి ఎదుట ఓ నిండు గర్భిణీ బైఠాయింపు…
పెద్దపల్లి జిల్లా:
అంతర్గాం
నిజం చెపుతాం న్యూస్:
జూన్:15
తన భర్త మృతి పట్ల అనుమానం ఉందని, ఆయనకు సంబంధించిన మిత్రులను విచారించి న్యాయం చేయాలని ఓ నిండు గర్భిణీ మహిళ ఆందోళనకు దిగింది.
ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం
సోమన్ పల్లికి చెందిన విద్య తన భర్త వేణుగోపాల్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మరణించాడు.
అయితే వేణుగోపాల్ మిత్రులు గుంట వెంకటేష్, తాళ్లపల్లి రాజు వెంట వెళ్ళిన వేణుగోపాల్ కు ఎలా ప్రమాదం జరిగిందో తనకు ఎవరు చెప్పడం లేదని ఆమె ఆరోపించింది.
Also read: విశాఖపట్నం లో ఎంపీ సత్య నారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్
ఇదే క్రమంలో తనకు న్యాయం చేయాలని విద్య తన కుటుంబ సభ్యులతో కలిసి సోమన్ పల్లిలోని భర్త స్నేహితుడు వెంకటేష్ ఇంటి ఎదుట బైఠాయించింది.
ఏప్రిల్ 22న రాత్రి తన భర్తను పిలిపించుకుని మిత్రులు మద్యం సేవించారని, తెల్లవారేసరికి ప్రమాదంలో గాయపడ్డాడని ఆమె పేర్కొంది. అయితే చికిత్స పొందుతూ అదే నెల 27న వేణుగోపాల్ మరణించాడని తెలిపింది. ఈ విషయంలో తనకు అనుమానం ఉందని, తన భర్త మృతి పట్ల పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో మృతుని బంధువులు పాల్గొన్నారు.