Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

విశాఖపట్నం లో ఎంపీ సత్య నారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్

.* వెంటనే స్పందించిన పోలీసులు.

* 17 టీం లతో గాలింపు

* చేదించిన పోలీసులు

* ఎంపీ కుటంభ సభ్యులు ఆడిటర్ సేఫ్.

కిడ్నాప్ కథ సుఖాంతం.

నూకేష్ ఏపీ బ్యూరో

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి జ్యోతి, కుమారుడు, ఆడిటర్ జి. వెంకటేశ్వరరావు లను గురువారం ఉదయం ఎంపీ ఇంటి వద్ద సినీ పక్కీలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 50 కోట్ల రూపాయలు కిడ్నాపర్లు డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ తివిక్రమ్ వర్మ వెంటనే రంగంలోకి దిగి 17 టీం లతో గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నం నుంచి ఏలూరు రోడ్డులో కిడ్నాపర్లు ఉన్నట్లు ఆచూకి తెలుసుకున్న పోలీసులు ఆ రహదారి లో చుట్టుముట్టి నలుగురు కిడ్నాపర్ల ను అదుపులోకి తీసుకొని వారి చెరలో ఉన్న ఎంపీ సతీమణిని కుమారుడిని

ఆడిటర్ జీ. వీ ని సురక్షితంగా రక్షించారు. ఈ సమయంలో ఎంపీ హైదరాబాద్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ హుటాహుటిన విశాఖపట్నం బయలుదేరారు.

ఈ సంఘటన లో ప్రదాన నిందితుడిగా రౌడీ షీటర్ హేమంత్ ను గుర్తించారు. పోలీస్ ల చొరవతో కిడ్నాప్ కథ సుఖాంతం అవ్వడం తో విశాఖ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో శ్రమించి కేవలం కొన్ని గంటల్లోనే కిడ్నాప్ ను చేధించిన పోలీసులను ఎంతో మంది అభినందిస్తున్నారు.